Samantha : ఇదే నా చివ‌రి సినిమా.. ఏంటి స‌మంత ఇలాంటి కామెంట్స్ చేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఇదే నా చివ‌రి సినిమా.. ఏంటి స‌మంత ఇలాంటి కామెంట్స్ చేసింది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 January 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : ఇదే నా చివ‌రి సినిమా.. ఏంటి స‌మంత ఇలాంటి కామెంట్స్ చేసింది..!

Samantha : దక్షిణాది బ్యూటీ సమంత Samantha ఒక‌ప్పుడు Tollywood టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఈ అమ్మ‌డు రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ భారతదేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది. ప్రతి నెలా Bollywood బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ విడుదల చేసే జాబితాలో మొదటి స్థానాన్నే దక్కించుకుంటోంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది. నాగచైతన్యకు విడకులిచ్చిన ద‌గ్గ‌ర నుండి స‌మంత పూర్తిగా సినిమాల‌పై ఫోకస్ పెట్టింది. న మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సమంతకు వరసగా ఆఫర్లు రావడంతో, ప్రతీ సినిమాని ఎక్కడా మిస్ చేసుకోకుండా చేసింది…

Samantha ఇదే నా చివ‌రి సినిమా ఏంటి స‌మంత ఇలాంటి కామెంట్స్ చేసింది

Samantha : ఇదే నా చివ‌రి సినిమా.. ఏంటి స‌మంత ఇలాంటి కామెంట్స్ చేసింది..!

Samantha సామ్ ఎమోష‌న‌ల్..

ఆ మ‌ధ్య మ‌యోసైటిస్ బారిన ప‌డ్డ స‌మంత కొన్నాళ్ల‌పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తన సొంత బ్యానరులో మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించింది. దీనిపై ఇంతవరకు అప్ డేట్ ఇవ్వలేదు. అలాగే సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ విడుదలై మంచి హిట్ అయింది. త్వరలోనే మరో రెండు వెబ్ సిరీస్ లు చేయబోతోంది. ఒక దర్శకుడితో రిలేషన్ షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయికానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించింది. ఇటీవలే ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత ఎక్కువగా ముంబయిలోనే నివసిస్తోంది. అయితే Samantha స‌మంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ప్రస్తుతం తాను కావాలనుకుంటే ఎన్నో సినిమాలను అంగీకరించవచ్చని, కానీ తాను వాటిని అంగీకరించే పరిస్థితిలో లేనని చెప్పుకొచ్చింది సామ్ . తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించే నటిస్తానని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలనే యోచనతో ఉంటానన్నారు. సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో తనచేత పవర్ ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్టు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సిరీస్ లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రలను తాను కూడా సవాల్ గా స్వీకరిస్తానన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది