Chiranjeevi : చిరంజీవి డూప్‌గా 30 ఏళ్లుగా ఇతనే చేస్తున్నాడు.. ఆయన ఎవరో తెలుసా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవిని ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్లు కూడా లేకపోలేదు. కొంత మంది దర్శకులు చిరంజీవి కోసం ప్రత్యేక కథలు తయారు చేయడం, నిర్మాతలు కూడా రిస్క్ చేసి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి అంటే అందరికి డ్యాన్స్, ఫైట్స్ గుర్తొస్తాయి. తన రియల్ స్టంట్స్ తో చిరంజీవి అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాలలో కొన్ని సన్నివేశాలలో హీరోలకు బదులుగా డూప్ లు నటిస్తారు.
Chiranjeevi : ఇతనే డూప్..
కొన్ని రిస్కీ షాట్లను హీరోలతో తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపరు.చిన్న ప్రమాదం జరిగినా హీరోల కెరీర్ పై ప్రభావం పడుతుంది కాబట్టి డూప్ లతో షూటింగ్ చేస్తారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వల్ల హీరోల డూప్ లు సైతం వెలుగులోకి వస్తున్నారు. హీరో చిరంజీవికి డూప్ గా చేసే వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. మెగాస్టార్ కు 30 సంవత్సరాలుగా డూప్ చేసిన వ్యక్తి పశ్చిమగోదావరి కి చెందినవాడు కావడం విశేషం. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మర్తురికి చెందిన వాడు. ఈ క్రమంలో అతని గురించి వివరాలు బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మార్తుర్ కు చెందిన ప్రేమ్ కుమార్ కు సొంతంగా రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీ ఉంది. తనలాంటి వాళ్లను వెలుగులోకి తెస్తున్న ఈటీవీ ఛానెల్ కు ప్రేమ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఆరు పదుల వయస్సులో కూడా చిరంజీవి మాస్, క్లాస్ ప్రేక్షకులు మెచ్చే పాత్రలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. 2022 సంవత్సరంలో చిరంజీవి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. రామ్ చరణ్ నటించిన మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే ఛాన్స్ ఉంది. 2023 సంవత్సరం మెగా నామ సంవత్సరం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని అంటున్నారు.