This Week OTT Release : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. కొత్త ఏడాది సినిమాల పండగ షురూ..!
ప్రధానాంశాలు:
This Week OTT Release : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. కొత్త ఏడాది సినిమాల పండగ షురూ..!
This Week OTT Release : ప్రతి వారం వెండి తెర మీద వచ్చే సినిమాలే కాదు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీటిలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు కొన్నైతే.. మరికొన్ని థియేట్రికల్ రన్ ముగిశాక డిజిటల్ రిలీజ్ అయ్యేవి కొన్ని ఉంటాయి.. వీటిలో కొన్ని క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఎప్పటిలానే ఈ వారం లో కూడా రిలీజ్ అవుతున్న ఒటీటీ, సీరీస్ ల లిస్ట్ చూస్తే. ఈ వారం ఓటీటీలో ఒబామాని మెప్పించిన ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ వస్తుంది. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకి బాగా నచ్చిన సినిమా ఇది. కని కుశ్రుతి, దివ్య ప్రభ లీడ్ రోల్స్ చేసిన ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ సినిమాను పాయల్ కపాడియా డైరెక్ట్ చేశారు. ముంబైలో ఇద్దరు నస్రుల కథా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రేమ కోసం తపించి పోయే హృదయం తో పాటు ముంబై మహానగరంలో ఒక ఇంటి కోసం పేదల ఆవేదన ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో జనవరి 3న స్ట్రీమింగ్ అవుతుంది…
This Week OTT Release వీటితో పాటుగా..
నెట్ ఫ్లిక్స్ Netflix లో.. అవిసీ (డాక్యుమెంటరీ) డిసెంబర్ 31న వస్తుంది.
డోట్ డై (హాలీవుడ్) జనవరి 1న స్ట్రీమింగ్ అవుతుంది.
మిస్సింగ్ యే (వెబ్ సీరీస్) జనవరి 1.
రీ యూనియన్ (హాలీవుడ్) జనవరి 1
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సీరీస్) జనవరి 1
సెల్లింగ్ ది సిటీ (వెబ్ సీరీస్) జనవరి 1
వెబ్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సీరీస్) జనవరి 4
ఇక అమేజాన్ ప్రైం లో రిలీజ్ అవుతున్నవి..
గ్లాడియేటర్2 (హాలీవుడ్) జనవరి 1
ది రిగ్ (వెబ్ సీరీస్) జనవరి 2
గుణ (హిందీ) జనవరి 3
మనోరమా మ్యాక్స్ లో..
ఐయాం కథలన్ (మలయాళం) జనవరి 1
ఆహా లో..
జొల్లీ ఓ జింఖానా (తమిళ్) డిసెంబర్ 30
బుక్ మై షో లో..
క్రిస్మస్ ఈవ్ ఇన్ మిల్లర్స్ పాయింత్ (హాలీవుడ్) డిసెంబర్ 30
వీటితో పాటుగా మలయాళ సినిమా మార్కో కేరళలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమాను హనీఫ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 1న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. OTT, Movies, Web Series, Tollywood, Hollywood