Vakeel saab : వకీల్ సాబ్ ఈ ఏడాది మొత్తం థమన్ పేరే వినిపిస్తుంది..మరి వాళ్ళు..?
Vakeel saab : వకీల్ సాబ్ నిన్న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మనకంటే ముందు యూఎస్ ప్రీమియర్ షోస్ పడ్డప్పుడే బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది. ఇక మన దగ్గర షోస్ మొదలయ్యాక మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి వకీల్ సాబ్ సరైన ఎంపిక అని ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళని వకీల్ సాబ్ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి ఇలాంటి కథ చేయడం అంటే పెద్ద సాహసమే, అది కూడా మూడేళ్ళ తర్వాత. అంతేకాదు మూడేళ్ళ ముందు అజ్ఞాతవాసి ఫ్లాప్ సినిమా పవన్ అకౌంట్ లో ఉంది.
ఇన్ని లెక్కల మధ్య ఒక బాలీవుడ్ రీమెక్ సెలెక్ట్ చేసుకోవడం పవన్ గట్స్ కి నిదర్శనం. కథ ఏమాత్రం చెడిపోకుండా పవన్ కళ్యాణ్ ని అభిమానులు ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అంతకు మించి దర్శకుడు వేణు శ్రీరాం చూపించాడు. పవన్ కనిపించే ప్రతీ సీన్ అద్భుతంగా చెక్కాడని అంటున్నారు. పవర్ స్టార్ అంటే పవర్ ప్యాక్డ్ సినిమా అని ఆ సినిమా.. వకీల్ సాబ్ లా ఉంటుందని చిత్ర బృందం నిరూపించింది. నిన్నటి రోజు వకీల్ సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర ఏదో జాతర జరుగుతున్నట్టే వాతావరణం నెలకొంది.
Vakeel saab : వకీల్ సాబ్ పవన్ కెరీర్ లో బెగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అంటున్నారు.
ఇక ఈ సినిమా కి మ్యూజిక్ అందించిన థమన్ గురించి ఈ ఏడాది మొత్తం మాట్లాడుకుంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వకీల్ సాబ్ సక్సస్ కి ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటూ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా కోర్టులో సీన్స్ .. యాక్షన్ సీన్స్ తో పాటు ట్రైన్ ఫైట్ సమయంలో థమన్ బీజీఎం కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. థమన్ తప్ప మరే మ్యూజిక్ డైరెక్టర్ అయినా వకీల్ సాబ్ సినిమాకి ఈ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవారు కాదేమో అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి నిర్మతగా దిల్ రాజు, దర్శకుడిగా వేణు శ్రీరాం.. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులుగా చేశారని చెప్పుకుంటున్నారు. ఇక వకీల్ సాబ్ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అంటున్నారు.