Virupaksha : విరూపాక్ష లో ఆ సీన్ లు మార్చేసారు .. ఆ సీన్లు ఇవే ! 

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 April 2023, 3:00 pm

Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ విరూపాక్ష ‘ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతు టాప్ ట్రేడింగ్ లో నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్  నేపథ్యంలో సాగే ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే ఇది కార్తీక్ దండు కి మొదటి సినిమా కాదట. 8 ఏళ్ల క్రితం దర్శకుడుగా మారి భం భోలేనాథ్ సినిమా తీశాడు. నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

Those scenes were changed in Virupaksha

Those scenes were changed in Virupaksha

అలాగే నిఖిల్ కార్తికేయ సినిమాకి మూల కథ అందించారు. తాజాగా కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. భం బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చడంతో స్క్రీన్ ప్లే అందిస్తానని చెప్పారు. అలాగే సినిమాలో కొన్ని మార్పులు చెప్పారు. సుకుమార్ సార్ ని కలిసిన 6, 7 సార్లు స్క్రీన్ ప్లే వర్షన్లను రాసుకున్నాం కానీ ప్రధాన కథనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు.

Virupaksha Official Trailer | Sai Dharam Tej | Samyuktha Menon | Sukumar B  | Karthik Dandu - YouTube

క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే. అది చాలా బాగా వర్క్ అవుట్ అయింది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ విలన్ ని సుకుమార్ గారు మార్చేశారు. అలాగే సినిమాలో కనిపించిన కొన్ని యూనిక్ మర్డర్ సన్నివేశాలు సుకుమార్ గారే సూచించారు అని కార్తీక్ దండు చెప్పుకొచ్చారు. ఇక విరుపాక్ష బ్లాక్ బస్టర్ అవడంతో కార్తీక్ దండుకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. నెక్స్ట్ సినిమాను కూడా థ్రిల్లర్ జోన్ లోనే తీయాలనుకుంటున్నాడట. మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత సినిమా చేసి హిట్టు కొట్టడం మామూలు విషయం కాదు. మొదటి సినిమా ఫ్లాప్ అయితే కొందరు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతారు కానీ కార్తీక్ దండు అలా చేయకుండా ఇక్కడే ఉండి వచ్చాడు కాబట్టే ఈరోజు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp