Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ విరూపాక్ష ‘ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతు టాప్ ట్రేడింగ్ లో నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే ఇది కార్తీక్ దండు కి మొదటి సినిమా కాదట. 8 ఏళ్ల క్రితం దర్శకుడుగా మారి భం భోలేనాథ్ సినిమా తీశాడు. నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
అలాగే నిఖిల్ కార్తికేయ సినిమాకి మూల కథ అందించారు. తాజాగా కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. భం బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చడంతో స్క్రీన్ ప్లే అందిస్తానని చెప్పారు. అలాగే సినిమాలో కొన్ని మార్పులు చెప్పారు. సుకుమార్ సార్ ని కలిసిన 6, 7 సార్లు స్క్రీన్ ప్లే వర్షన్లను రాసుకున్నాం కానీ ప్రధాన కథనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు.
క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే. అది చాలా బాగా వర్క్ అవుట్ అయింది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ విలన్ ని సుకుమార్ గారు మార్చేశారు. అలాగే సినిమాలో కనిపించిన కొన్ని యూనిక్ మర్డర్ సన్నివేశాలు సుకుమార్ గారే సూచించారు అని కార్తీక్ దండు చెప్పుకొచ్చారు. ఇక విరుపాక్ష బ్లాక్ బస్టర్ అవడంతో కార్తీక్ దండుకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. నెక్స్ట్ సినిమాను కూడా థ్రిల్లర్ జోన్ లోనే తీయాలనుకుంటున్నాడట. మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత సినిమా చేసి హిట్టు కొట్టడం మామూలు విషయం కాదు. మొదటి సినిమా ఫ్లాప్ అయితే కొందరు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతారు కానీ కార్తీక్ దండు అలా చేయకుండా ఇక్కడే ఉండి వచ్చాడు కాబట్టే ఈరోజు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.