Tollywood Small Films : చిన్న సినిమాలంటే అందరికీ చిన్నచూపే. ఆ సినిమాలకు అసలు థియేటర్లు కూడా దొరకవు. కానీ.. ఒక్కోసారి ఆ చిన్న సినిమాలు తమ సత్తాను చూపిస్తాయి. పాన్ ఇండియా సినిమాలు, ఇంకా వేరే సినిమాలు ఏవైనా కానీ.. వీటి ముందు దిగదుడుపే. చివరకు పాన్ ఇండియా అంటూ వచ్చిన కొన్ని సినిమాలు అయితే ఈ సినిమాల ముందు చతికిలపడ్డాయి. ఇక.. ఈ సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై ప్రభంజనం సృష్టించాయి. 2023 లో చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు అంటే అందరూ ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుతారు.
ఇంతకీ ఆ మూడు సినిమా ఏంటి అంటారా? మీరు కూడా గెస్ చేయొచ్చు. అందులో తొలి స్థానాన్ని ఆక్రమించింది బలగం. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. ఈ సినిమాకు ఎంత ఆదరణ వచ్చిందంటే.. ఏ సినిమాకు కూడా ఈరోజుల్లో ఊళ్లలో పరదాలు వేసుకొని చూడలేదు. ఎంత బిగ్ స్టార్ సినిమాలకు కూడా అలాంటి ఆదరణ రాలేదు కానీ.. బలగం సినిమా ఊరూరా ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ సినిమాకు తెలంగాణ ప్రజలే కాదు.. వేరే రాష్ట్రాల ప్రజలు కూడా ఆదరించారు. చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది ఆ సినిమా.
ప్రేక్షకుడు ఒక రెండు గంటలు సినిమా థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నంత సేపు బయటి ప్రపంచాన్ని మరిచిపోవాలి. కేవలం ఆ సినిమాను ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు. సామజవరగమన సినిమా అదే చేసి చూపించింది. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక.. ఇటీవల రిలీజ్ అయిన బేబీ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం మీద 2023 లో ఇప్పటి వరకు వచ్చిన చిన్న సినిమాల్లో అదరగొట్టేసిన సినిమాలు అంటే ఈ మూడు సినిమాలే అని చెప్పుకోవాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.