Jr NTR : ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌ వల్ల కష్టాలు.. ఎంత పని చేశావ్‌ తారక్‌! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌ వల్ల కష్టాలు.. ఎంత పని చేశావ్‌ తారక్‌!

Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి అంటూ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారికి ఎన్టీఆర్ అంటే మొదటి నుండి ఒకింత కోపం అయ్యి ఉంటుంది లేదా ఎన్టీఆర్ అంటే వారికి ఇష్టం ఉండి ఉండదు. ఇప్పుడు దాన్ని ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని కలిసిన విషయం తెలిసిందే. ఆ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 September 2022,9:00 pm

Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి అంటూ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారికి ఎన్టీఆర్ అంటే మొదటి నుండి ఒకింత కోపం అయ్యి ఉంటుంది లేదా ఎన్టీఆర్ అంటే వారికి ఇష్టం ఉండి ఉండదు. ఇప్పుడు దాన్ని ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని కలిసిన విషయం తెలిసిందే. ఆ కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన కోపం ఉందట. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా హీరో నితిన్ కూడా ఇటీవల బీజేపీ నాయకుడినిన కలిశాడు. వారిద్దరూ రాజకీయంగా ఏమి మాట్లాడలేదు..

ఆయన కూడా అమిత్ షా ని కలవడంతో టాలీవుడ్ కి కేసిఆర్ కి మధ్య వైరం పెరిగినట్లు అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వైరం కారణంగానే ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయింది అనేది కొందరి వాదన. అయితే చిత్ర సభ్యుల ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయ లేదు పోలీసుల అనుమతి లేని కారణంగానే సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయిందని వారు చెప్తున్నారు. రాజకీయ కోణం లేదు అనేది వారి మాట.. కానీ అసలు విషయం అదే అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే టాలీవుడ్ లో ముందు ముందు జరగబోతున్న కార్యక్రమాలకు కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏదో విధంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని..

Tollywood big stars angry on Jr NTR and hero nitin because bjp leaders meeting

Tollywood big stars angry on Jr NTR and hero nitin because bjp leaders meeting

అందుకు ఎన్టీఆర్ కారణం అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజకీయ కారణం లేకుండా వెళ్లి అమిత్ షా ని ఎందుకు కలవాల్సి వచ్చిందంటూ కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తున్నారట. అందరూ ఒక వైపు… ఎన్టీఆర్ ఒకవైపు అన్నట్లుగా ఇప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో చాలా మంది ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ ఒంటరి వాడయ్యాడు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది