
Tollywood celebrities are in holi celebrations
Holi :హోలీ పండుగ అంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఇష్టమైనది అని ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. జీతం ఎప్పుడు రంగులమయం కావాలని కోరుకుంటూ చిన్నా పెద్దా.. పేద ధనిక, కులం, మతం అన్న బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ.
ఒకప్పుడు హోలీ పండుగ అనేది నార్త్ ఇండియన్స్ కల్చర్ మాత్రమే అని భావించేవారు. కానీ రాను రానూ ప్రతీ ఒక్కరు ఈ హోలీ పండుగను జరుపుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగను రెండు రోజులు జరుపుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సినీ తారలంతా తమ కుటుంబాలతో కలిసి ఎంతో ఉత్సాహంగా హోలీ సంబరాలను జరుపుకున్నారు.
టాలీవుడ్ స్టార్స్ తో పాటు బుల్లితెర యాంకర్స్ కూడా హోలీ సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. అంతేకాదు ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో అభిమానులకి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ తాజా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి.. పిల్లలతో తన నివాసంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాడు. తారక్ ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో కలిసి గడపడానికి ఇష్టపడతాడు. అలాగే ఈసారి హోలీ పండుగను బాగా జరుపుకున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహలత రెడ్డి ఎంత అన్యోన్యంగా ఉంటారో వారిని బయట పబ్లిక్ ఫంక్షన్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. అల్లు అర్జున్ సినిమాల ప్రభావం ఫ్యామిలీ మీద అసలు పడనీయడు. సినిమా షూటింగ్ అయిపోయిందంటే మరుక్షణం ఇంటి ధ్యాస తప్ప మరొకటి ఉండదు. అల్లు అర్జున్ – స్నేహలని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కాగా తాజాగా హోలీ పండుగని అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నాడు.
చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30న స్నేహితుడు గౌతం కిచ్లు ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత మాల్దీవుల్లో గ్రాండ్ గా హనీమూన్ సెలబ్రేట్ చేసుకున్న కాజల్ ఆ తర్వాత నుంచి ఆచార్య..మోసగాళ్ళు..ముంబై సాగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతోంది. కాగా ఇటీవల పెళ్ళి తర్వాత మొదటిసారి వచ్చిన హోలి పండుగనో భర్తతో కలిసి ఘనంగా జరుపుకుంది. కొత్త జీవితం ఎంతో కలర్ ఫుల్ గా సాగాలని కోరుకుంది.
బుల్లితెర పాపులర్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్ తన భర్త .. పిల్లలతో కలిసి హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే శ్రీముఖి..మరో యాంకర్ వర్షిణి సౌందరాజన్ హోలీ సంబరాలను జరుపుకున్నారు.
వీరే కాదు.. ఆర్ ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్ పుత్..కంచె భామ ప్రగ్యా జైస్వాల్..సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ సహా పలువురు సినిమా తారలంతా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ హోలీ పండుగను జరుపుకోవడం సర్వాత్రా ఆసక్తిని కలిగించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.