Tollywood Couple : మరో అందమైన టాలీవుడ్‌ జంట విడాకులకు సిద్ధం అయ్యారట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood Couple : మరో అందమైన టాలీవుడ్‌ జంట విడాకులకు సిద్ధం అయ్యారట

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,12:00 pm

Tollywood Couple : సినిమాల బడ్జెట్‌ మరియు వసూళ్ల విషయంలో బాలీవుడ్‌ తో మన తెలుగు సినిమా పరిశ్రమ ఎలా అయితే పోటీ పడుతుందో అన్ని విషయాల్లో కూడా పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కేవలం బాలీవుడ్‌ కే పరిమితం అనుకునే వాళ్లం. ముద్దులు.. లిప్ లాక్ లు కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఉంటాయి అనుకునేవాళ్లం. ప్రేమ వివాహాలు, విడాకులు, వివాదాలు కేవలం బాలీవుడ్ లోనే ఎక్కువ అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు అవన్నీ టాలీవుడ్‌ లో కూడా కనిపిస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే అక్కడ కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌ లో విడాకుల ట్రెండ్‌ నడుస్తోంది.

సెలబ్రెటీ కపుల్‌ బ్యాక్ టు బ్యాక్‌ విడాకులు తీసుకుంటూ తమ సొంత జీవితాన్ని అనుభవించేందుకు గడిపేందుకు అడుగులు వేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన వారు చాలా ఈజీగా విడిపోయినట్లుగా ఇప్పుడు సెలబ్రెటీలు ప్రేమ వివాహాలు చేసుకుని అంతే ఈజీగా విడిపోతూ అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తున్నారు. టాలీవుడ్‌ కు చెందిన ఒక సెలబ్రెటీ జంట ఇప్పుడు విడాకుల కోసం వెయిట్‌ చేస్తుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి పేర్లు ప్రస్తుతానికి అధికారికంగా వెళ్లడించలేం కాని వారు ఇండస్ట్రీలో అందరికి సుపరిచితులే. ప్రేక్షకులకు కూడా వెండి తెర మరియు బుల్లి తెరపై కనిపించారు.

tollywood Celebrity couple going to Divorce

tollywood Celebrity couple going to Divorce

వారిద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో సింగర్స్ గా మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. ఆ పాప ను చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగించకుండా ఇప్పుడు విడాకులు తీసుకోవాలని ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. పాప విషయంలో ప్రస్తుతం కాస్త కన్ఫ్యూజన్‌ నెలకొన్నప్పటికి త్వరలోనే ఒక క్లారిటీకి వచ్చి వారిద్దరు కూడా విడాకులు తీసుకుని వేరు వేరుగా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీకి చెందిన వారి సన్నిహితులు చెప్పి చూశారు. కాని వారు మాత్రం వినడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు వారి మద్య ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది