Tollywood Director : ఒక వైపు సక్సెస్ లేవు మరో వైపు భార్య తో విభేదాలు.. దర్శకుడి మనోవేదన
Tollywood Director : ఆయన టాలీవుడ్కు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత చరిత్ర ఆయనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర ను టాలీవుడ్ పై వేసిన దర్శకుడు ఆయన. ఒకానొక సందర్భంలో ఆయన దర్శకత్వంలో నటించేందుకు యంగ్ హీరోలు.. స్టార్ హీరోలు.. సీనియర్ హీరోలు ఇలా ప్రతి ఒక్కరు ఆసక్తి చూపించారు అంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం లేకపోయినప్పటికీ మంచి సినిమాలు తెరకెక్కించిన ఘనత మాత్రం సొంతం చేసుకున్నాడు.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో పాటు కమర్షియల్ సక్సెస్ లు సొంతం చేసుకోవడం ఆయన సినిమాలకే చెల్లింది. అయితే ఇదంతా చరిత్ర. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆయనతో కనీసం సినిమాలు చేసేందుకు కూడా హీరోలు ఆసక్తి చూపించట్లేదు. సీనియర్ హీరోలు సరే కనీసం చిన్న హీరోలు అయినా ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒకే సినిమాను పట్టుకుని వేలాడుతున్నాడు అనే గుసగుసలు వస్తున్నాయి. ఆ సినిమా ఎప్పటికి వస్తుందో.. వచ్చినా సక్సెస్ అవుతుందో లేదో క్లారిటీ లేదు. ఇన్ని కష్టాల నడుమ ఆ దర్శకుడు ఇప్పుడు కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

tollywood director family problems
ఆయన భార్య తో గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పిల్లల కోసం వారిద్దరూ కలిసి ఉండాలని అంటున్నారు కానీ ఇక మీదట అలా జరగదని, వారు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వారి స్నేహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే కెరీర్ పరంగా కష్టాలను ఎదుర్కొంటున్న దర్శకుడు భార్య నుండి విడిపోతే వ్యక్తిగతంగా మరింత నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ సినిమాల్లో సక్సెస్ దక్కించుకోవాలన్న కోరిక నెరవేరక పోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు మరియు ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.