Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంచలన నిర్ణయం? షాక్ లో సినీ అభిమానులు?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 25 June 2021, 8:08 pm

Tollywood : ఇదివరకు 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఏదైనా సినిమా ప్రమోషన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. సోషల్ మీడియా ఉంది కదా. ప్రస్తుతం జనాలు అంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అందుకే.. సోషల్ మీడియాలోనే సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు.. తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ల పేరుతో తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అది కూడా ఉచితంగా. రూపాయి ఖర్చు లేకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా తమ సినిమాలకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేస్తోంది. అందుకే.. అది ఏ సినీ ఇండస్ట్రీ అయినా సరే.. ఎవరైనా సరే.. సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటున్నారు.

tollywood director koratala siva quits social media

tollywood director koratala siva quits social media

ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు అయితే సోషల్ మీడియాను ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలి. కానీ.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా డైరెక్టర్ మాత్రం ఏకంగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో సినీ లోకం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఆ డైరెక్టర్ ఎవరు? అసలు.. ఆయన ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారో తెలుసుకుందాం రండి.

Tollywood : సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కొరటాల శివ

మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ డైరెక్టర్ కొరటాల శివ.. తాజాగా సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కొరటాల శివకు ఫేస్ బుక్ తో పాటు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో అకౌంట్లు ఉన్నాయి. అయితే.. ఆయన ఎందుకు ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

tollywood director koratala siva quits social media

tollywood director koratala siva quits social media

హలో.. నేను ఇక నుంచి సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్తున్నాను.. ఇది అందరికీ చెప్పాలని ఈ పోస్ట్ పెడుతున్నా. నేను ఇప్పటి వరకు ఇక్కడ నా అభిప్రాయాలను పంచుకున్నా. కానీ.. ఇప్పుడు మాత్ర సోషల్ మీడియా నుంచి వెళ్లి పోయే సమయం వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్లిపోయినా.. మీడియా ద్వారా, స్నేహితుల ద్వారా మీకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటా. మన మధ్య ఉండే బంధం మాత్రం ఎక్కడికీ పోదు. కాకపోతే నేను మీతో మాట్లాడే మీడియం మారుతుంది.. అంతే.. అంటూ కొరటాల శివ తన చివరి పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి క్విట్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి