Tollywood : ఆ హీరోయిన్‌ ను వాడుకుని ఆఫర్‌ ఇవ్వకుండా మోసం చేశారట!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 May 2022,9:30 pm

Tollywood : పరిశ్రమ ఏదైనా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్గా కొనసాగుతోంది. అది సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా ఉంటుందని.. చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ కొనసాగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. అవకాశాల కోసం ఎక్కడి నుంచో వస్తారు. అవకాశాలు రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లడానికి వారికి మనసు రాదు. దాంతో ఇండస్ట్రీ లోనే ఏదో ఒకటి చేసి ఉండాలని కొందరు భావిస్తారు. అలా హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారిలో కొందరు అవకాశాలు రాకపోవడంతో అడ్డ దారిలో అయినా అవకాశాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో మనసు చంపుకొని తమ అవసరం కోసం చేయకూడని పనులు కూడా చేస్తుంటారని గతంలో పలు సంఘటనలు చెప్పకనే చెప్పాయి.

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన అమ్మాయిలపై కొందరు ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటి వారు అమ్మాయిలను పట్టుకొని సినిమా ఆఫర్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అలాంటి సంఘటనలు చాలా జరిగినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఆ విషయంలో జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పకుండా తమలోనే మదనపడుతూ చివరకు ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల ఒక హీరోయిన్ (ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించింది) మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూస్తోందట.

Tollywood heroine cheated by a man with movie offers

Tollywood heroine cheated by a man with movie offers

ఆమెకు ఆఫర్లు ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడట. నిర్మాతలకు అతడు సన్నిహితుడు అవ్వడం వల్ల సినిమా ఆఫర్లు ఇప్పిస్తాడు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తికి సదరు హీరోయిన్ దగ్గర అయిందట. అతడు ప్రేమిస్తున్నానని సినిమాలో ఛాన్స్ ఇస్తానని నమ్మబలికి శారీరకంగా కూడా దగ్గరై.. సినిమాలో ఆఫర్ పేరుతో విచ్చలవిడిగా ఆమెతో గడిపిన అతను ఇప్పుడు ముఖం చాటేశాడట. తనను అతడు మోసం చేశాడంటూ ఆ హీరోయిన్ ఇప్పుడు కన్నీరుమున్నీరవుతోంది. అయినా కూడా ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలని భావించడం లేదట. స్నేహితులు సలహా ఇచ్చినా కూడా ఆమె మాత్రం పోలీసుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నదట. అతడిపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ సన్నిహితుల వద్ద ఆ హీరోయిన్ వ్యాఖ్యలు చేస్తుందట. ఎంతో మంది హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నా కూడా అవకాశాల పేరుతో జరుగుతున్న మోసాలు మాత్రం ఆగడం లేదు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి