Star Heros : మరదళ్లనే పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరో మీకు తెలుసా..?
Star Heros : పెళ్లంటే నూరేళ్ళ పంట. వాస్తవానికి ఈ పెళ్లిళ్లన్నీ స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన ప్రేమ పెళ్ళిల్లే ఎక్కువగా జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు అనేవి ఇప్పుడు సింపుల్ అయిపోయాయి. ముఖ్యంగా సినీతారలు ప్రేమ పెళ్లిల్లు చేసుకోవటం అనేది ఇంకా సర్వసాధారణం అయిపోయింది. సినిమాల్లో నటిస్తూనే తొటి నటీనటులతో ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కుతారు కొందరూ నటీనటులు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒకప్పటి పలువురు టాప్ హీరోలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పాత తరం హీరోల్లో కొంత మంది తమ సొంత మరదలిని పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..
వారెవరో తెలియాలంటే కింద లిస్ట్ చూడండి.తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు స్వయాన తన మేనమామ కుమార్తెనే మనువాడారు. తన మరదలు బసవ రామతారకంను ఆయన పెళ్ళి చేసుకున్నారు. అయితే చిన్ననాటి నుంచి బసవతారకం, ఎన్టీఆర్ ఒకరినొకరు ఇష్ట పడ్డారట. వీరితో పాటు అదే జనరేషన్ కు చెందిన సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు అయినా ఇందిరాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన రామారావు లాగా కాకుండా.. ఇందిరా దేవి ఉండగానే సినీ నటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిరను మాత్రం కృష్ణ ఏనాడు ఇబ్బంది పెట్టలేదని సమాచారం.

tollywood star heros married her own sister in laws
Star Heros : మరదళ్లను మనువాడిన ఆ హీరోలు వీరే:
మరోవైపు విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం తన మరదలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య విద్యాదేవి పలు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోగా… ఆమె సొంత చెల్లి అయిన నిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు పుట్టిన కూతురు లక్ష్మీప్రసన్న కుమారుడు విష్ణు ల కోసమే తాను ఈ వివహం చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆ రెండో భార్యకు మనోజ్ పుట్టారు. వీరితో పాటు నటుడు సాయికుమార్ కొడుకు ఆది, తమిళ తంబీ సూర్య తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలినే వివాహామాడారు.