Tollywood : అగ్ర నిర్మాణ సంస్థలకు తప్పని తిప్పలు..?
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలు కొన్ని వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ప్రకటించి చిక్కుల్లో పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. వీటిలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ అని కూడా అంటున్నారు. ఈ రెండు సంస్థలు చాలా జాగ్రత్తగా బడ్జెట్ పెరగకుండా ఉండే సినిమాలను ఒకే చేస్తూ వాటిని పూర్తి చేస్తూ వస్తున్నారు. కానీ, దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి కొన్ని పెద్ద సంస్థలు మాత్రం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ..వాటిని పూర్తి చేస్తూ సాగుతున్నాయి. అయితే, మైత్రీ సంస్థ ఇప్పుడు గట్టిగా లాకయినట్టు తెలుస్తోంది.
ఈ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్.టి.ఆర్ లాంటి అగ్ర హీరోల నుంచి నాని లాంటి మీడియం రేంజ్ హీరోల వరకు సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే, అందరు హీరోలతో సినిమాలు చేయాలనే ఆరాటంతో చక చకా దర్శకుడికి, హీరోలకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు.
కానీ, అలా అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్న కాంబోలో సినిమా మొదలవడం లేదు. దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమానే. ప్రకటించినప్పటి నుంచీ గనక చూసుకుంటే ఈ సినిమా ఈ పాటికి రిలీజై రికార్డుల గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ, ఇప్పటి వరకు ఆసలు ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఇదే సంస్థలో నాని నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు కూడా ఎన్.టి.ఆర్, ప్రచాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాను ప్రకటించి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.
Tollywood : అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్..!
ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగానూ ప్రకటించారు. కానీ, ఇది పట్టాలెక్కడానికి చాలా నెలలు సమయం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మైత్రీలో ఇంకా చాలా ఉన్నాయట. ఇక దిల్ రాజు సంస్థలో కూడా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. వాటి బడ్జెట్ విషయంలో కాస్త అటు ఇటు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా శంకర్ – రామ్ చరణ్ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు. తెలుగులో ఉన్న మరికొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలది ఇదే పరిస్థితి. కరోనా దెబ్బతో ప్రాజెక్ట్స్ అన్నీ తారుమారవడం కూడా దీనికి కారణం. ఇదే విషయంలో సురేష్ బాబు లాంటి వారు మాత్రం బడ్జెట్ పెరుగుతుందీ అంటే మొత్తానికి ఆపేయడానికి కూడా ఆలోచించడం లేదు. దీనికి ఉదాహరణ గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో ప్రకటించిన హిరణ్య కశిప సినిమానే.