త్రిష కొత్త యాడ్.. భలే వెరైటీగా ఉందే!!
సౌత్ స్టార్ త్రిష ప్రకటనలతోనూ బిజీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మామూలుగా త్రిష కెరీర్ మొదలైంది కూడా అక్కడే. హార్లిక్స్ వంటి ఇతర ఉత్పత్తుల ప్రకటనల్లో త్రిష మొదటగా నటించింది. అలా అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతుకు మించి అనేలా అందరినీ ఆకట్టుకుంటోంది.

Trisha Britannia Toas tea New ad
మామూలుగా త్రిష ఇప్పుడు సినిమాలతోనే బిజీగా ఉంది. కానీ ప్రకటనలు కూడా చేస్తూ అక్కడ కూడా బాగానే సంపాదిస్తోంది. తాజాగా త్రిష తన కొత్త యాడ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సంబరపడిపోయింది. ఈ యాడ్‌లో నటించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. బ్రిటానియా వారికి థ్యాంక్స్ అంటూ త్రిష ఎమోషనల్ అయింది. ఈ వీడియోలో త్రిష ఫుల్ ఎనర్జీగా కనిపించింది.
ఉదయం పూట బ్రిటానియా టోస్టీ తింటే అంతే ఎనర్జీగా ఉంటారట. పిల్లలకు పీఈటీ టీచర్‌లా, భర్తకు మేనేజర్‌లా, మామగారికి ఫ్యామిలీ డాక్టర్‌లా అన్ని పనులు చకచకా చేసేస్తారట. మొత్తానికి ఈ సరికొత్త యాడ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటానియా టోస్టీ టీంతో పని చేయడంతోఎంతో ఆనందంగా ఉందంటూ త్రిష ట్వీట్ చేసింది. ప్రస్తుతం త్రిషకు తమిళ ప్రాజెక్ట్‌లు మాత్రమే వస్తున్నాయి. తెలుగులో ఒక్క సినిమా కూడా త్రిష ఒప్పుకోలేదు. ఆ మధ్య ఆచార్యలో నటించేందుకు ఒప్పుకుంది కానీ అది ఎంతటి వివాదంగా మారిందో అందరికీ తెలిసిందే.
To be a part of this campaign and become a part of the Britannia Toastea team has been an incredible experience. So happy to share with everyone the secret for our “Karari Shuruwat”. #BritanniaToastea #SubahKoDoEkKarariShuruwat #KarariShuruwat #RightStart@BritanniaIndLtd pic.twitter.com/LEMWiulOLm
— Trish (@trishtrashers) January 5, 2021