Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా పట్ల తన ప్రేమను ఒకేసారి చూపించి ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రస్సులో మెరిసిపోయిన త్రిష, తన భుజంపై ఉన్న ప్రత్యేక టాటూను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

#image_title
కెమెరా టాటూ వెనుక ఉన్న అర్థం
త్రిష భుజంపై ఉన్న టాటూ రూపంలో ఓ కెమెరా కనిపించింది. కెమెరా అంటే సినిమాలు, నటన, రంగస్థలం అన్నీ త్రిషకు ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ టాటూ బాగా సూచిస్తోంది. “కెమెరా నా జీవితం” అనేలా ఈ టాటూ ఆమె సినీ ప్రయాణానికి గుర్తుగా నిలిచింది. త్రిష ధరించిన డ్రస్ బాడీ మొత్తాన్ని కవర్ చేసినప్పటికీ, భుజంపై ఉన్న కెమెరా టాటూను స్పెషల్‌గా హైలైట్ చేసింది. త్రిష స్టైల్, గ్రేస్‌కు మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వైరల్ అవుతున్నాయి.
తన కెరీర్‌లో ఇప్పటికే 40 వసంతాలు పూర్తి చేసిన త్రిష, ఇప్పటికీ తానేనా అన్నట్లు మెరిసిపోతూ వుంటుంది. పెళ్లి ఇంకా చేయకపోయినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఆమెను “ఎవర్గ్రీన్ బ్యూటీ” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె అందం, ఆకర్షణ కాలంతో సంబంధం లేకుండా కొనసాగుతోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.