Home » Entertainment » Trivikram Srinivas Buys New Luxury Car For His Wife
Entertainment

Trivikram : తన అందాల భార్య కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ ఏం చేశాడో తెలుసా.. ఇది బ్రేకింగ్ న్యూస్ లకే బ్రేకింగ్ న్యూస్..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 3, 2022, 7:38 pm
Advertisement

Trivikram : తెలుగు సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినీ రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు పేరున్న దర్శకుడిగా మారారు. ఆయనకు ఉన్న రేంజే వేరు. ప్రస్తుతం శ్రీనివాస్.. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. మహేశ్ బాబు సినిమా పూర్తయ్యాక.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ చివరి మూవీ అల వైకుంఠపురములో. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు కదా.

Advertisement

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్.. బీఎండబ్ల్యూ కారును కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఎండబ్ల్యూలో అది లగ్జరీ కారు. రూ.1.34 కోట్ల విలువైన కారు అది. నిజానికి.. త్రివిక్రమ్ కు కార్లంటే మోజు. త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా తాజాగా బీఎండబ్ల్యూ సిరీస్ లో కారును తీసుకున్నారు. ఆయన కారు కొన్న తర్వాత తన భార్యతో కలిసి కారు కీస్ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

trivikram srinivas buys new luxury car for his wife

Advertisement

Trivikram : తన భార్య కోసం గిఫ్ట్ గా ఇచ్చిన త్రివిక్రమ్

బీఎండబ్ల్యూ 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారు. ఈ కారును తన భార్య కోసం త్రివిక్రమ్ బహుమతిగా ఇచ్చారట. త్రివిక్రమ్ వైఫ్ సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్. ఆమె చాలా వేదికలపై నృత్య ప్రదర్శనలు చేశారు. తన భార్య కోసం గిఫ్ట్ ఇవ్వడానికే త్రివిక్రమ్ ఆ లగ్జరీ కారును కొనుగోలు చేశారట. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆ ఫోటోను చూసి సూపర్ కారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి