
trolled person is this one on Anasuya
Anasuya : బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ గురించి మనందరికి తెలిసిందే. అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారగా, గత కొన్నిరోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆంటీ అనడంతో అనసూయ వారిపై కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్‌తో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కించడం అనసూయ హాబీ కాగా, ఆ ఫొటోలతోనే కొందరు ట్రోల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవల లైగర్ రిలీజ్ అయినప్పుడు సినిమా బాలేదన్న టాక్ రావడంతో అనసూయ… కాస్త కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో అటు విజయ్ ఫ్యాన్స్‌తో పాటు.. కొందరు నెటిజన్లు కూడా అనసూయపై తీవ్ర విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో అనసూయని ట్రోల్ చేశారు. దాంతో చిర్రెత్తిపోయిన అనసూయ.. ఇక మీ అందరి పని పడతాను. అలా కామెంట్లు పెడుతున్న వాళ్లందరిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు కనిపెట్టి అరెస్టు చేశారు. ఇన్ని రోజులు ఇవన్ని చేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పండరి రామ వెంకట వీర్రాజుగా పోలీసులు అతన్ని ఐడెంటిఫై చేశారు. గత కొంతకాలంగా అనసూయని సోషల్ మీడియాలో పండరి వేధిస్తూ వస్తున్నాడు. ఇన్ని రోజులు మొబైల్ ఫోన్లు మారుస్తూ పండరి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు..
trolled person is this one on Anasuya
వారం రోజులు పాటు కోనసీమలో మకాం వేసిన పోలీసులు చిట్ట చివరకు పండరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. ఇతను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్‌లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్టు తేలింది. ఈనెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు చేయగా, ఇతను “సాయి రవి 267” అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ ఫొటోస్ పెడుతున్నాడు. నిందితుడు గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు. అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పాటు మంత్రి రోజా ఫొటోలు కూడా ఇతను పోస్ట్ చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.