Anasuya : ముసలిదానిలా మారావంటూ అనసూయపై ట్రోల్స్
Anasuya: సూయ..సూయ అనసూయ ఎట్టా పుట్టావే అనసూయ అంటూ కుర్రాళ్లు పాటలు పాడుకుంటున్నారు. ఇద్దర పిల్లల తల్లి అయిన కూడా అనసూయ మంచి గ్లామర్‌గా కనిపించేది. జబర్ధస్త్‌లో కూడా బాగా గ్లామర్ మెయిన్టేయిన్ చేసేది. కానీ. రానురాను ఆమె సినిమాల్లో బిజీగా వుండడంతోపాటు గ్లామర్‌ను సరిగ్గా పాటించడంలేదని నెటిజన్లు అంచనావేస్తున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో పెట్టిన ఫొటోలను చూసి అవాక్కయ్యారు. రవితేజ ఖిలాడిలో గ్లామర్‌గానూ రఫ్‌గానూ కనిపించిన అనసూయ పుష్పలో మాస్ తరహా పాత్రలో కనిపించింది.
సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్‌టైన్ చేస్తుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్. ‘ముసలి దానిలా కనిపిస్తున్నావ్’, ‘ముఖంలో గ్లో తగ్గింది’, ‘మేకప్ సరిగ్గా వేసుకోలేదా ?’, ‘అసలైన వయసు బయటపడింది’, ‘మేకప్, డ్రెస్సింగ్ బాలేదు’, ‘ముడతలు కనిపిస్తున్నాయ్’, ‘కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు ‘చాలా అందంగా ఉన్నారు’,

trolling on anasuya
Anasuya ; అనసూయపై కామెంట్స్..
‘లుకింగ్ నైస్’, ‘వావ్’, ‘బ్యూటిఫుల్’ అంటూ పొగుడుతున్నారు. ఇటీవల అనసూయ తాను పోస్ట్ చేసిన పిక్స్‌లో కాస్త గ్లామర్ తగ్గినట్టు కనిపించింది. దీంతో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. చూడ్డానికి ఇందులో ఆమె ఫేస్ మడతలుగా, కాస్త డిఫరెంట్‌గా ఉంది. మేకప్ సరిగా లేదు. జుట్టు కూడా వేరోలా ఉంది. ఫోటోల్లో సరిగా పడలేదో, లేక అదొక స్టయిలో ఏమోగానీ, అది అభిమానులకు నచ్చలేదట. దీంతో కామెంట్లు చేస్తున్నారు. మేకప్ అస్సలు బాగా లేదని, ఎడిటింగ్ బాగా లేదని, చాలా డిజప్పాయింట్ అయ్యామని అంటున్నారు. కొందరైతే ఏజ్ బార్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ముసలిదానివి అవుతున్నావ్ అనసూయ అంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.