Intinti Gruhalakshmi : బతుకమ్మ వేడుకల్లో తులసి ఫ్యామిలీకి అనుకోని షాక్.. లాస్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా? సామ్రాట్, తులసి మళ్లీ కలుస్తారా?

Authored By Varun G | The Telugu News | Updated on: October 9, 2022, 9:06 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 10 అక్టోబర్ 2022, ఎపిసోడ్ 759 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫైల్ వంకతో తులసితో మాట్లాడుదామని అనుకుంటాడు సామ్రాట్. కానీ.. తులసిని కలవక ముందే అనసూయ కలుస్తుంది సామ్రాట్ ను. తులసి ఉద్యోగం విషయం మనిద్దరి మధ్యనే ఉండాలని అనసూయ.. సామ్రాట్ తో ఒట్టేయించుకుంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు సామ్రాట్ కు. తులసిని కలిసినా ఫైల్ కోసమే వచ్చానని చెబుతాడు. అసలు విషయం చెప్పడు. కానీ.. తులసి మాత్రం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. మన ఆఫీసు బంధం తెగింది కానీ.. మన స్నేహబంధం కాదు. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.. నేను మీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అంటుంది తులసి. దీంతో మీకు కోపం రాదా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఎందుకు రాదు. ఆ కోపాన్ని నాలోనే దాచుకుంటాను. కోపాన్ని బయటపెట్టకపోతేనే బెటర్ కొన్నిసార్లు అని చెబుతుంది తులసి.

tulasi and her family participates in bathukamma celebrations

tulasi and her family participates in bathukamma celebrations

ఆ తర్వాత తమ కాలనీలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయని, సామ్రాట్, హనీని ఆహ్వానిస్తుంది తులసి. కానీ.. సామ్రాట్ మాత్రం తనకు కుదరదు అంటాడు. దీంతో హనీని అయినా ఖచ్చితంగా పంపించాలని చెబుతుంది. ఆ తర్వాత తులసికి అనుమానం జరుగుతుంటే అనసూయ ఎందుకు అంత మౌనంగా ఉంది. అత్తాకోడళ్ల మధ్య ఏదో బయటికి తెలియని యుద్ధం జరుగుతోంది. ఇదే సరైన సమయం. ఆ పెద్దావిడను మనవైపునకు తిప్పుకోవాలి అని అనుకుంటుంది లాస్య. దీంతో వెంటనే అనసూయకు ఫోన్ చేసి.. నందుకు జనరల్ మేనేజర్ పోస్ట్ రావడం మీ ఆశీర్వాదం వల్లనే అని చెప్పాడు. అందుకే మీ పేరుతో గుడిలో పూజ చేయించాలని నందు అనుకుంటున్నాను. మీరు ఇంటికి రండి అని పిలుస్తుంది లాస్య. దీంతో నాకు రావడం కుదరదు కానీ.. రేపు మేమంతా గుడికి వెళ్తున్నాం. అక్కడికి రండి. అక్కడే ఆ పూజలేవో చేయించొచ్చు అని చెబుతుంది అనసూయ.

ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత అనసూయ గుడికి రావడానికి ఒప్పుకున్నట్టు నందుతో చెబుతుంది లాస్య. దీంతో నందు కూడా సంతోషిస్తాడు. మరోవైపు బతుకమ్మ సంబురాలకు ఎలా డ్యాన్స్ చేయాలో అని అంకిత, దివ్య, శృతి అందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంతలో అభి, ప్రేమ్ పూలు తీసుకొస్తారు.

Intinti Gruhalakshmi : బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్పించిన తులసి

పూలు తీసుకొచ్చాక.. మాకు బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్పించండి అని తులసిని శృతి, అంకిత అడుగుతారు. బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్పించి.. బతుకమ్మ విశిష్టత చెప్పు మామ్ అని అడుగుతుంది దివ్య. దీంతో సరే అని అంటుంది తులసి. బతుకమ్మను పేర్చుతూ బతుకమ్మ పండుగ గురించి చెబుతూ ఉంటుంది తులసి.

మరోవైపు బతుకమ్మ వేడుకల కోసం తులసి ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉంటుంది హనీ. సామ్రాట్ కు కూడా అక్కడికి వెళ్లు అని చెబుతాడు బాబాయి. కానీ.. నేను వెళ్లను అంటాడు సామ్రాట్. నా హద్దుల్లో నేను ఉంటాను అంటాడు సామ్రాట్. కేవలం హనీని తీసుకెళ్తాడు సామ్రాట్.

బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయి. అందరూ అక్కడికి వస్తారు. నందు, లాస్య కూడా అక్కడికి రావడం చూసి తులసి ఫ్యామిలీ షాక్ అవుతుంది. అసలు తను ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. అనసూయ వాళ్లను చూసి చేయి ఊపుతుంది.

అయితే.. సామ్రాట్ ను కూడా బతుకమ్మ వేడుకలకు రప్పించాలని హనీతో ఫోన్ చేయిస్తుంది లాస్య. తనకు కడుపునొప్పిగా ఉందని, వెంటనే రావాలని హనీ సామ్రాట్ ను కోరుతుంది. దీంతో వెంటనే బతుకమ్మ వేడుకల దగ్గరికి వస్తాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp