
tulasi meets her childhood friends in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 19 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 818 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన చిన్ననాటి వస్తువులను చూసి మురిసిపోతుంది తులసి. వాక్ మెన్ గురించి చెబుతుంది సామ్రాట్ కు. ఈ వాక్ మెన్ లో మా అమ్మ పాటిన పాటకు సంబంధించిన క్యాసెట్ ఉంది అంటుంది. కానీ.. ఇది ఓపెన్ అవడం లేదు. ఇది బాగుపడితే మా అమ్మ పాడిన పాటను వినే అవకాశం నాకు దక్కుతుంది అని అనుకుంటుంది తులసి. మరోవైపు అంకిత.. లాస్య మాటలకు చాలా బాధపడుతుంది. అక్కడికి వచ్చిన పరందామయ్య, అనసూయ ఏం బాధపడకు అమ్మా. మేము మొత్తం విన్నాం అంటారు. తనకు ధైర్యం చెబుతారు. కానీ.. అభి మాత్రం లాస్య ఆంటీ చెప్పిన దాంట్లో తప్పేముంది అంటాడు. దీంతో అభి మీద అంకితకు చాలా కోపం వస్తుంది.
tulasi meets her childhood friends in intinti gruhalakshmi
కట్ చేస్తే తన చిన్ననాటి వస్తువులను తీసుకొని ఆ ఇంటి నుంచి బయటికి వస్తుంది తులసి. ఆ తర్వాత ఆ ఇంటి ముందు కొన్ని ఫోటోలు దిగుతారు ఇద్దరూ. మరోవైపు పరందామయ్యకు నిద్ర వస్తుంటే.. టీ తీసుకురమ్మని చెబుతుంది అనసూయ. దీంతో శృతి టీ పెట్టడానికి వెళ్తుంది. కానీ.. ఫ్రిడ్జ్ లాక్ వేసి ఉంటుంది. దీంతో ఏం చేయాలో శృతికి అర్థం కాదు. పాలప్యాకెట్ కోసం ఇప్పుడు లాస్యను వెళ్లి బతిమిలాడాలా? తప్పదు అని అనుకుంటుంది శృతి. తన దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ తాళం కావాలి అంటుంది. దీంతో ఎందుకు అని అడుగుతుంది. దీంతో పాల ప్యాకెట్ కావాలి అంటుంది. ఇప్పటికే రెండు సార్లు తాగాడు కదా. ఎన్నిసార్లు తాగుతారు. ఇలా అయితే కష్టం. ఎవ్వరికైనా రెండు సార్లే టీ. అంతకుమించి ఒక్కసారి కూడా ఉండదు. వెళ్లి చెప్పు అంటుంది లాస్య.
దీంతో చేసేది లేక.. ఎలాగైనా పరందామయ్యకు టీ పెట్టాలని డికాషన్ పెడుతుంది. మరోవైపు తులసి, సామ్రాట్ కారును అడ్డగిస్తారు ముగ్గురు మహిళలు. కారు దిగండి అని డిమాండ్ చేస్తారు. దీంతో వాళ్లేంటి అలా బెదిరిస్తున్నారు. మనమేం తప్పు చేశాం అంటాడు సామ్రాట్.
దిగుతారా లేక కిందికి లాగమంటారా? అంటారు. దీంతో చందా అడిగే బ్యాచ్ కావచ్చు అంటుంది తులసి. దీంతో ఏంటి చందాలడిగే బ్యాచ్ లా కనిపిస్తున్నామా? వీళ్లు మర్యాదగా దిగేలా లేరు. ఒక పట్టుపడదామా ఏంటి అని అంటారు. దీంతో సరే.. కారు దిగుదాం అంటారు.
ఇద్దరూ కారు దిగుతారు. దీంతో ఏంటి ఊరంతా తెగ తిరిగేస్తున్నారు అంటారు. దీంతో ఇది మా చిన్ననాటి ఊరు అంటుంది తులసి. దీంతో చిన్ననాటి ఊరు గుర్తుంది కానీ.. చిన్ననాటి స్నేహితులు గుర్తు లేరే అంటారు. మరి ఏం చేద్దాం అంటే.. తీసుకెళ్లి చిన్న చెరువులో ముంచేద్దాం అనేసరికి.. వాళ్లు తన చిన్ననాటి ఫ్రెండ్స్ అని గుర్తొస్తుంది తులసికి.
అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇక వెళ్లొస్తాం అంటుంది తులసి. ఇవాళ ఉండొచ్చుగా అంటే కుదరదు మళ్లీ అమ్మను తీసుకొని వస్తా అంటుంది తులసి. ఇంతలో మీది లవ్ మ్యారేజా. నీ భర్త హీరోలా ఉన్నాడు అనడంతో తులసికి ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే కారు వెక్కి వెళ్లిపోతుంది.
మరోవైపు అనసూయకు ఫోన్ చేస్తుంది తులసి. ఎలా ఉన్నారు అని అడుగుతుంది. దీంతో లాస్య గురించి అన్ని విషయాలు చెబుతుంది అనసూయ. దీంతో ఏం చేయాలో అర్థం కాదు తులసికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.