Haritha – Sreevani : మూగబోయిన శ్రీవాణి గొంతు.. కన్నీరు పెట్టుకున్న హరిత.. ఎమోషనల్ వీడియో

Advertisement

Haritha – Sreevani : బుల్లితెరపై తారలంతా కూడా ఇప్పుడు సైడ్ బిజినెస్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా యూట్యూబ్ చానెల్ పెట్టేసుకున్నారు. వాళ్లింట్లో ఏం జరిగినా, ఏకొత్త వస్తువు కొన్నా కూడా వీడియోలు చేసి పడేస్తుంటారు. మరీ దారుణంగా కిచెన్ టూర్ అని, అందులో ఫ్రిడ్జ్ టూర్ అని, బెడ్రూం టూర్ అని ఇలా పైత్యాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. ఇక అలా ఇప్పుడు ప్రతీ ఒక్కరూ చానెళ్లలతో బాగానే సంపాదిస్తున్నారు. హరిత జాకీ, శ్రీవాణి, శివజ్యోతి, మహి శివన్ ఇలా అందరూ కూడా యూట్యూబ్ చానెళ్లతో దూసుకుపోతోన్నారు. గత నెల నుంచి శ్రీవాణి గొంతుకు సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ నెల పాటుగా ఒక్క ముక్క కూడా మాట్లాడటానికి వీల్లేదని వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సైగలతోనే బతికేస్తోంది. అయినా కూడా వీడియోలు చేయడం మాత్రం ఆగడం లేదు…

Advertisement

Haritha – Sreevani : మాటలు రాకపోయినా..

ఆ సైగలతోనే వీడియోలు చేస్తూ బాగానే సంపాదించేసుకుంటోంది. అయితే తాజాగా వరలక్ష్మీ వ్రతం అంటూ హరిత తన ఇంట్లో గ్రాండ్‌గా పూజను చేసింది. దీనికి తన సన్నిహితులందరినీ పిలిచింది. ఇందులో భాగంగా ఆమని, గృహలక్ష్మీ లాస్య, ఉదయ భాను, శ్రీవాణి ఇలా అందరూ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ వీడియోలో హరిత కన్నీరు పెట్టేసుకుని అందరినీ ఎమోషనల్ చేసింది.

Advertisement
TV Artist Haritha Cries on Sreevani Tongue Problem
TV Artist Haritha Cries on Sreevani Tongue Problem

Haritha – Sreevani : ఏడ్చిన హరిత..

శ్రీవాణి గొంతు సమస్య తెలుసుకుని హరిత కన్నీరు పెట్టేసింది. తనకేం కాలేదని, అంతా ఒక నెలలో సెట్ అవుతుందని శ్రీవాణి సైగ చేస్తుంది. అయినా కూడా హరిత మాత్రం ఏడుపు ఆపదు. ఇక ఉదయ భానుకి కూడా విషయం తెలిసి ఎమోషనల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీవాణి కూతురు కూడా సందడి చేసింది.

Advertisement
Advertisement