WOW 3 : మొదటిసారిగా ఇలా.. వినిపించేవారు కనిపించబోతోన్నారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WOW 3 : మొదటిసారిగా ఇలా.. వినిపించేవారు కనిపించబోతోన్నారు!

 Authored By bkalyan | The Telugu News | Updated on :11 February 2021,1:30 pm

WOW 3 : మనకు తెరపై కొన్ని పాత్రలు గుర్తుకు వచ్చినప్పుడల్లా కొందరు గుర్తుకు వస్తుంటారు. మరీ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పుడు హీరో వాయిస్, విలన్ల వాయిస్, హీరోయిన్ల క్యూట్ వాయిస్ ఇలా అన్ని గుర్తుకు వస్తాయి. అది మాట్లాడేది వారు కాదని కూడా మనకు తెలుసు. కానీ వారు మాట్లాడుతూ ఉంటే అచ్చం అలాగే ఉంటుంది. అలా అనిపించేందుకు తెర వెనక డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఎంతో కష్టపడుతుంటారు. వారి గొంతు వల్లే పాత్రలు ఎంతో అద్భుతంగా వస్తుంటాయి.

Dubbing Artists In sai kumar WOW 3 show

Dubbing Artists In sai kumar WOW 3 show

కానీ వారికి మాత్రం సరైన గుర్తింపు ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ కూడా తమ గొంతుతో వినిపిస్తుంటారు. కానీ ఎక్కువగా కనిపించరు. అయితే సాయి కుమార్ కూడా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లోని తన ఫ్యామిలీ మెంబర్స్‌ను తన వావ్ షోలోకి తీసుకొచ్చాడు. వచ్చే వారం డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు మొదటిసారిగా తెరపై కనిపించబోతోన్నారు. ఇందులో ముఖ్యంగా తమిళ హీరోలకు డబ్బింగ్ చెప్పే అతను వచ్చాడు.

తమిళ హీరోలైన విజయ్, సూర్య, విశాల్ ఇలా ఎందరెందరికో డబ్బింగ్ చెబుతుంటాడు శ్రీనివాస మూర్తి. విలన్లకు తనదైన శైలిలో గొంతును అరువిచ్చి భయపెడుతుంటాడు ఆర్సీఎం రాజు. ఇక హీరోయిన్లకు చిలక పలుకుల్లా గొంతులను అరువిచ్చే హరిత అందరికీ తెలిసిందే. ఇలియానా, శ్రుతీ హాసన్ వంటి స్టార్ హీరోయిన్లకు హరిత చెప్పే డైలాగ్‌లకు అందరూ ఫిదా అవుతుంటారు. కొత్తగా వచ్చే హీరోయిన్లకు శ్వేత చెప్పే డబ్బింగ్ అదిరిపోతుంది. ఈ నలుగురు కూడా వచ్చే వారం వావ్‌లో దుమ్ములేపనున్నారు.

YouTube video

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది