Bigg Boss 5 Telugu  : మంచాలు కూడా పక్కపక్కనే వేసుకోవాలా?.. సిరి, షన్నుల పరువుదీసిన ఉమాదేవీ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 20 September 2021, 3:15 pm

Bigg Boss 5 Telugu  బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో ఇప్పటి వరకు ఫైర్ బ్రాండ్‌లా ఉన్న ఉమా దేవీ ఎలిమినేట్ అయింది. బూతుల దాడితో ఎక్కువగా నెగెటివిటీ ఏర్పర్చుకుంది. రెండో వారంలో నామినేషన్ ప్రక్రియ సమయంలో బీప్ వేసేంతగా మాటలను వదిలింది. దీంతో జనాలు ఆమెను తిరస్కరించారు. ఎలిమినేట్ చేసేశారు. అయితే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సరయు, ఉమాదేవీలు ఇద్దరూ కూడా సిరి, షన్నులను ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు. అవే మాటలు మాట్లాడుతున్నారు.

Uma Devi In Bigg Boss 5 Telugu

Uma Devi In Bigg Boss 5 Telugu

ప్రియ వేస్ట్ అంటోన్న ఉమాదేవీ Bigg Boss 5 Telugu

సిరి, షన్నులు కలిసి ఆడుతున్నారు.. ఒకరికొకరు ఆడుతున్నారు.. గూడుపుఠాణి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. సరయు అయితే ఈ ఇద్దరి మీద ఓ రేంజ్‌లో మండిపడింది. ఇక ఉమా దేవీ సైతం ఇదే వ్యాఖ్యలను చెప్పింది. ఎవరి ఆట వారు ఆడుకోండి.. నువ్ నీ కోసం ఆడేందుకు వచ్చావ్.. పక్కవారి కోసం కాదంటూ… సిరి, షన్నులకు సలహా ఇచ్చింది. మొత్తానికి బయటకు వచ్చాక మాత్రం ఉమా దేవీ తనలోని కోపాన్ని అంత బయటపెట్టేసింది.

 

Uma Devi In Bigg Boss 5 Telugu

Uma Devi In Bigg Boss 5 Telugu

రవితో మంచి గొడవ జరుగుతుందని చూశా.. కానీ కుదర్లేదు అని చెప్పింది. ప్రియ అయితే వేస్ట్.. ఈ షోకు పనికి రాదు అని దారుణ కామెంట్లు చేసింది. ఇక సిరి, షన్నులు అయితే కలిసి ఆడుతున్నారు.. ఎక్కడ సిరి ఉంటే.. అక్కడ షన్ను ఉండాల్సిందే…ఇద్దరి మంచాలు కూడా పక్కనే పక్కనే వేసుకోవాలా? అంటూ ఏకిపారేసింది. ఈ ఇద్దరు ఎంత కాలం ఇలా ఆడతారో.. ఈ ఆటలు అన్ని సార్లు పనికి రాదు.. సిరి ఏదో ఒక వారం బయటకు వస్తుంది అని ఉమా దేవీ చెప్పుకొచ్చింది.

Uma Devi In Bigg Boss 5 Telugu

Uma Devi In Bigg Boss 5 Telugu

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి