Karthika Deepam Bhagyam : కంటతడి పెట్టేసిన కార్తీకదీపం భాగ్యం.. కూతుళ్ల గురించి చెబుతూ స్టేజ్ మీద ఎమోషనల్

Authored By aruna | The Telugu News | Published on: September 24, 2022, 2:30 pm

Karthika Deepam Bhagyam : కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెరపై మంచి క్రేజ్‌ను దక్కించుకుంది ఉమా దేవీ. కార్తీక దీపం భాగ్యం అంటూ ఉమా దేవికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. కమెడియన్‌గా ఉమా దేవికి మంచి డిమాండ్ ఏర్పడింది. అలా కార్తీక దీపం సీరియల్‌తో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఉమా దేవీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లింది. అలా ఉమా దేవీ.. ఐదో సీజన్‌లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ షోతో ఉమా దేవీకి దారుణమైన నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. ఆమె పచ్చి బూతులు మాట్లాడటంతో అసలుకే ఎసరు వచ్చింది. బిగ్ బాస్ ఎడిటర్లు సైతం కళ్లు, చెవులు మూసుకునే స్థితి వచ్చింది.

నాగార్జున గట్టిగానే అక్షింతలు వేశాడు. కానీ ఉమా దేవీ తన నోటి దురుసుతో నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. వెంటనే ఎలిమినేట్ అయింది. ఇక బయటకు వచ్చిన ఉమా దేవీకి ఆఫర్లు లేకుండా పోయాయి. కార్తీక దీపం సీరియల్ నుంచి ఉమా దేవీని తీసేశారు. ఆ కారెక్టర్‌ను అర్దాంతరంగా మాయం చేసేశారు. అలా కార్తీక దీపం నుంచి ఉమా దేవీని పంపించేశారు. ఇక ఇప్పుడు ఆమెకు ఏ సీరియల్ కూడా లేకుండా పోయింది. బయట వేరే సీరియళ్లలోనూ ఆమె కనిపించడం లేదు. అయితే అడపాదడపా షోలు, ఈవెంట్లలో మాత్రం కనిపిస్తుంటుంది.

Karthika Deepam Bhagyam Aka Uma Devi About Her Daughters

Karthika Deepam Bhagyam Aka Uma Devi About Her Daughters

ఇక ఆమె పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం, సింగిల్ పేరెంట్ కష్టాలను ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. మొగుడు లేకపోయినా, వదిలేసినా కూడా తన పిల్లలను ఎంత కష్టపడి పెంచుకుంటోందో చెబుతూ అందరినీ ఎమోషనల్ చేసేసింది. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో ఉమా దేవీ కంటతడి పెట్టేసింది. తన పెద్ద కూతురు అంటూ అందరికీ పరిచయం చేసింది. పేరుకు కూతురే అయినా కూడా తల్లిలా చూసుకుంటుందని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇక రెండో కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అని చెబుతూ.. హరిత జాకీలు అమ్మానాన్నల్లా దగ్గరుండి చేయించారు.. చీర పెట్టారు అంటూ స్టేజ్ మీద వారి గురించి చెబుతూ కంటతడి పెట్టేసుకుంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp