RRR Movie : దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ RRR Movie రచ్చ మొదలైంది. ఇన్నాళ్ల ఎదురు చూపులకి పులిస్టాప్ పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరూ వీరలను మొదటిసారి వెండితెరపై స్నేహితులుగా చూపించబోతున్నాడు జక్కన్న.. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి విదేశాల్లోనూ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తాము ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు.కెనడాలో కార్లతో కలిసి ఆర్ఆర్ఆర్ అని.. ఎన్టీఆర్ అంటూ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఓ చిన్నపాటి విమానంకు బ్యానర్ కట్టి ఆకాశంలో ఎగరవేశారు. దానిపై తొక్కుకుంటూ పోవాలే.. జై ఎన్టీఆర్ అంటూ పెద్ద పెద్ధ అక్షరాలతో రాసి ఆకాశంలో ప్రదర్శించారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తమ అభిమానాన్ని పలు రకాలుగా ప్రదర్శించారు. అయితే ఈ రోజు రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు.బెనిఫిట్ షో తెల్లవారు జామున మూడు గంటలకి మొదలైంది. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మరికొంతమంది మెగా ఫ్యామిలీలు కలిసి ఈ బెనిఫిట్ షో చూశారు.
రాజమౌళి, రామ్ చరణ్ లు థియేటర్ కి బెనిఫిట్ షోకి రావడంతో అభిమానులు ఈలలు, అరుపులతో హంగామా చేశారు. మంచి మంచి సీన్స్, పాటలు వస్తున్న సమయంలో పేపర్స్ విసిరారు. ఉపాసన కూడా పేపర్లు ఎగరేస్తూ నానా రచ్చ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాని బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉపాసన upasana ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ .. అక్షయ్ కుమార్.. శ్రియా శరణ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‌తో డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.