upasana kamineni netizens fire on mega power star ram charan wife
Upasana : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన బిజినెస్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్ నర్‌గా వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చింది. సామాజిక సేవలు, ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఒకటి ఆమెను వివాదంలోకి నెట్టింది.ఇంతకీ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఏంటంటే.. ఇటీవల ఉపాసన గుడిగోపురంపై దేవుళ్ల ఫొటోలకు బదులు సినీ తారల బొమ్మలతో పెయింట్ వేసిన పిక్‌ను ఒకదానిని నెట్టింట పోస్ట్ చేసింది.
కాగా, అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరలయింది. అయితే, ఈ ఫొటోను చూసిన కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉపాసన వ్యవహరించిందంటూ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫొటోలు పెట్టి తన గౌరవాన్ని తగ్గించుకోకూడదని ఉపాసనకు ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు సలహాలిస్తున్నారు. గుడిగోపురంపై నిలబడటమే కాకుండా చెప్పులు ధరించి ఉన్న వాళ్ల పోస్ట్ షేర్ చేయడమేంటి? అలా చేయడం ద్వారా హిందూ దేవుళ్లపైన వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతున్నదని కామెంట్స్ చేస్తున్నారు. అలా ఉపాసన తాజాగా వివాదంలోకి వచ్చింది.
upasana kamineni netizens fire on mega power star ram charan wife
అయితే, ఇటువంటి కామెంట్స్ వస్తున్నప్పటికీ ఉపాసన మాత్రం ఆ పోస్టును డిలీట్ చేయడకుండా అలానే ఉంచింది. ఈ సోషల్ మీడియా పోస్టు గురించి మెగాస్టార్ చిరంజీవికి కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కాని బహుశా తెలిసి ఉండకపోవచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డారు. హోం ఐసొలేషన్ లో ఉన్నారు చిరు. ఇక రామ్ చరణ్ తేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేయబోయే చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫిల్మ్ కోసం చరణ్ వర్కవుట్ చేస్తున్నారని టాక్.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.