Chiranjeevi VS Balakrishna : చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ… పారితోషికం విషయంలో మరీ అంత తేడానా?
Chiranjeevi VS Balakrishna : తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు కూడా సుదీర్ఘ కాలంగా తెలుగు సినిమా పరిశ్రమల కొనసాగుతూ ఉన్నారు. ఎన్టీఆర్ నట వారసత్వమును పునిక పుచ్చుకుని నందమూరి బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ చిరంజీవి మాత్రం సొంతంగా ప్రయత్నాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 20 సంవత్సరాల పాటు వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఆ 20 సంవత్సరాల్లో కూడా చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో ఉండగా బాలకృష్ణ నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ఇప్పటికి కూడా వీరిద్దరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.
మొన్న సంక్రాంతికి వీరిద్దరూ ఢీ అంటే ఢీ అంటూ తాము నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో పోటీ పడ్డారు. రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య పై చేయి సాధించింది. ఆ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది, ఇక ఈ ఇద్దరు హీరోల యొక్క రెమ్యూనరేషన్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు హీరోల్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఎవరు అంటే ఏమాత్రం అనుమానం లేకుండా మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వస్తుంది.. కానీ ఇద్దరి రెమ్యూనరేషన్ కి చాలా వ్యత్యాసం ఉంటుందట. ముఖ్యంగా బాలకృష్ణ రెమ్యూనరేషన్తో పోలిస్తే చిరంజీవి రెమ్యూనరేషన్ దాదాపు డబల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
బాలకృష్ణ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తారని, అలాగే కొందరు హీరోలు సినిమాల విడుదల తర్వాత లాభాల్లో వాటాలు తీసుకున్నట్లుగా బాలకృష్ణ అలాంటి వాటాలు తీసుకోడని అంటూ ఉంటారు. చిరంజీవి మాత్రం మొదట్లోనే భారీగా అడ్వాన్సు రెమ్యూనరేషన్ తీసుకొని.. ఆ తర్వాత లాభాల్లో వాటాలను తీసుకుంటూ ఉంటాడు. అలా వీర సింహారెడ్డికి బాలకృష్ణ తీసుకున్న పారితోషికంతో పోలిస్తే వాల్తేరు వీరయ్యకు చిరంజీవి తీసుకున్న పారితోషికం దాదాపు రెండు రెట్లు ఎక్కువ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అఫీషియల్ లెక్కలు ఏంటి అనేది మైత్రి మూవీ మేకర్స్ వారు నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.