Upasan : ఆడపడుచు సుస్మిత కోసం ఉపాసన సంచలన నిర్ణయం ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Upasan : ఆడపడుచు సుస్మిత కోసం ఉపాసన సంచలన నిర్ణయం ..!

Upasan : తెలుగు పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన టాలెంట్ తో టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. ఇక ఆయన వారసులు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. త్వరలోనే ‘ భోళాశంకర్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వ […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2023,10:00 am

Upasan : తెలుగు పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన టాలెంట్ తో టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. ఇక ఆయన వారసులు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. త్వరలోనే ‘ భోళాశంకర్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్ లలో విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిరంజీవి త్వరలోనే మరో సినిమా చేయనున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలు దర్శకత్వం వహించిన కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ సినిమాను రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవితోపాటు చిరు కుమారుడికి పాత్ర ప్రధానం కానుంది.

Upasana konidela sensational decision about sushmita

Upasana konidela sensational decision about sushmita

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తుంది సుమారుగా 16 సంవత్సరాలు తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. గతంలో స్టాలిన్ సినిమా చేశారు. ఇక ఈ సినిమాలో చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్దు జొన్నలగడ్డను అనుకున్నారు కానీ సిద్దు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులోకి యంగ్ హీరో శర్వానంద్ ను తీసుకొచ్చారు. రామ్ చరణ్ కి ఉపాసనకి అత్యంత సన్నిహితుడైన శర్వానంద్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. తన ఆడపడుచు నిర్మాత, తన మామ చిరంజీవి నటిస్తున్న సినిమాలో శర్వానంద్ అయితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని ఉపాసన శర్వానంద్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది