Jailer Movie First Review : నరసింహ రేంజ్ లో రజనీకాంత్.. జైలర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. సూపర్ స్టార్ అదరగొట్టేశాడు

Advertisement

Jailer Movie First Review : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్. ఇప్పటికీ ఆయన వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఈ వయసులో ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీయడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. దాన్ని సూపర్ స్టార్ రజనీ కాంత్ సుసాధ్యం చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా ఈనెల 10న విడుదల కాబోతోంది. ఆ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఇటీవల విజయ్ తో బీస్ట్ సినిమా తీశాడు నెల్సన్. కానీ.. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. అందుకే ఈసారి చాలా కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు నెల్సన్.

Advertisement

ఈ సినిమాలో రజనీకాంత్ కి జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమాపై రజనీ అభిమానులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు కేక పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.జైలర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అంటూ అనిరుధ్ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఫస్ట్ రివ్యూ అనే భావించాలి.

Advertisement
rajinikanth Jailer Movie First Review
rajinikanth Jailer Movie First Review

Jailer Movie First Review : ఆ పోస్ట్ లో ఏముంది?

నిజానికి.. అనిరుధ్ ఎప్పుడు కూడా ఇలా ఒక సినిమాకు రివ్యూ ఇవ్వడు. కానీ.. ఈ సినిమా గురించి ట్విట్టర్ లో రాసుకొచ్చాడు అంటే ఈ సినిమా మామూలుగా ఉండదు అనిపిస్తోంది. ఆ ట్వీట్ పై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చ ప్రారంభమైంది. రజనీకి నరసింహ రేంజ్ హిట్ వచ్చినట్టే. అప్పట్లో నరసింహ సినిమా ఎంత హిట్ అయిందో.. ఇప్పుడు జైలర్ మూవీ కూడా అంతే హిట్ కాబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంటే.. రజనీ ఈజ్ బ్యాక్ అనుకోవాల్సిందేనా. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Advertisement
Advertisement