Upasana : అసలు మీరు ఎవర్రా.. ఆయనను తిట్టడానికి.. ఉపాసన స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

Advertisement

Upasana : పకోడి గాళ్లు సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అని మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఉపాసన వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలపై చిరంజీవి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమా 200వ రోజు వేడుకలో ఆయన ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. అవే ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ పార్టీ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి.

Advertisement

అందుకే.. వైసీపీ నేతలు వెంటనే చిరంజీవిపై ఎదురు దాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై వెంటనే కొడాలి నాని ఫైర్ అయ్యారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో వాళ్లు సలహా ఇస్తున్నారు. పకోడీ గాళ్లు సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ వారికి రాజకీయాలు ఎందుకు.. డ్యాన్స్, ఫైట్, యాక్షన్ చూసుకుందాం అని చెప్పుకోవచ్చు కదా అంటూ చిరంజీవిని, పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు.కొడాలితో పాటు పేర్ని నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చిరంజీవి ఫ్యాన్ నే అని చెప్పారు. ఒకప్పుడు దండలు కూడా వేశామని గుర్తు చేశారు. చిరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు సినిమా హీరోలపై మాట్లాడిందా అని ప్రశ్నించారు. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని.. వాటిని ఎదుర్కోక తప్పదు అని పేర్ని నాని చిరంజీవికి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
upasana strong counter to kodali nani
upasana strong counter to kodali nani

Upasana  ఇదంతా పక్కన పెడితే చిరంజీవిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఉపాసన కూడా స్పందించారు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. చిరంజీవి గారిని అనే హక్కు ఫ్యామిలీకి, అభిమానులకు మాత్రమే ఉంది. మామూలుగా చిరంజీవి గారు చాలా సౌమ్యులు అంటారు. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత వేల మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారు. ఆయన గట్టిగా మాట్లాడితే ఏమౌతుందో వాళ్లకు తెలియదు. మేమందరం వెనకాల సైలెంట్ గా ఉండం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెబుతున్నాం.. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఉపాసన హెచ్చరించారు.

Advertisement
Advertisement