Krithi Shetty : కృతి శెట్టి రూటే సపరేటు.. సినిమా ముందు తర్వాత దేనికైనా సిద్దం

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 January 2022, 11:30 am

Krithi Shetty : మెగా బ్రదర్స్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా తోనే ఉత్తరాది ముద్దుగుమ్మ కృతి శెట్టి కూడా పరిచయం అయ్యింది. మొదటి సినిమా ఉప్పెనలో బేబమ్మ పాత్రలో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. గతంలో ఏ హీరోయిన్‌ కూడా ఒకే ఒక్క సినిమా తో వచ్చిన క్రేజ్‌ తో పది సినిమాలు సైన్ చేసిన దాఖలాలు లేవు. కాని బేబమ్మ కృతి శెట్టి మాత్రం ఉప్పెన సినిమా తెచ్చిన క్రేజ్‌ తో పది ఏంటీ అంతకు మించిన సినిమాలను సైన్ చేసింది. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఆమె సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. ఇక ఇటీవల కృతి శెట్టి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రచారం ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కృతి శెట్టి ఉప్పెన సినిమా సమయంలో ప్రమోషన్స్ లో కరోనా ను కూడా లెక్క పెట్టకుండా వైష్ణవ్‌ తేజ్ తో కలిసి చాలా తిరిగింది. ఆ సమయంలోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో ప్రమోషన్స్ కు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు కదా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఇక శ్యామ్‌ సింగ రాయ్ సినిమా ప్రమోషన్ కోసం కూడా నాని మరియు సాయి పల్లవిలతో కృతి శెట్టి చాలా మీడియా సమావేశాలకు హాజరు అయ్యింది. సాయి పల్లవిని మించి టీవీ ఇంటర్వ్యూలు మరియు ఇతర మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ఆ వారం రోజులు కూడా కృతి శెట్టి ఫొటోలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు బంగార్రాజు కోసం బేబమ్మ చాలా కష్టపడుతుంది.

uppena heroine krithi shetty is very active in movie promotions

uppena heroine krithi shetty is very active in movie promotions

Krithi Shetty : బంగార్రాజు లతో తెగ తిరిగేస్తున్న కృతి శెట్టి

నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందింది. నాగ చైతన్య కు జోడీగా నటించిన ఈ అమ్మడు సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఎక్కడికైనా.. ఎలాంటి ప్రమోషనల్‌ వేడుక అయినా హాజరు అయ్యేందుకు సిద్దం అంటుంది. ఇతర హీరోయిన్స్ కండీషన్స్ పెట్టడం లేదంటే ఇబ్బంది పడటం చేస్తారు. కాని ఈమె సినిమా ముందు మరియు తర్వాత యూనిట్‌ సభ్యులకు చేస్తున్న సపోర్ట్‌ అందరికి ముచ్చట కలిగిస్తుంది. అందుకే బేబమ్మ రూటే సపరేటు అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే బేబమ్మ ఇలా ప్రమోషన్స్ కు సహరిస్తే ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయంటున్నారు. ఈ ఏడాదిని బంగార్రాజు తో మొదలు పెట్టబోతున్న కృతి శెట్టి కనీసం మూడు నాలుగు సినిమాలతో అయినా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి