Vadinamma 20 Oct Today Episode : సిరి చేసిన పని కూడా నువ్వు చేయలేకపోయావు.. అంటూ సీతపై పార్వతి సీరియస్
Vadinamma 20 Oct Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు బాగా చదువుకున్నావు కదా.. ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో అని సీత అంటుంది. దీంతో భరత్ ఫీల్ అవుతాడు. నేను చదువుకున్నది మంచి ఉద్యోగం చేయడానికి కాదు. నేను ఎంత చదువుకున్నా.. షాపు చూసుకుంటాను అని చెబుతాడు భరత్. నాకు బాగా వచ్చిన పని షాపు చూసుకోవడమే అదే చేస్తాను. అన్నయ్య పదా షాప్ కు వెళ్దాం మనం అంటాడు భరత్.

vadinamma 20 october 2021 full episode
రఘురాం, భరత్.. ఇద్దరూ షాపునకు వెళ్తుంటారు. వెళ్తూ.. భరత్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూస్తాడు రఘురాం. ఒరేయ్ భరత్.. మేమందరం తల ఎత్తుకునేలా చేశావురా అంటాడు. ఎవరు ఈ ఫ్లెక్సీ పెట్టారు. తీసేద్దాం అన్నయ్య.. ఎవరైనా చూస్తే బాగోదు అంటాడు. హే వద్దురా.. ఉండనీయు.. ఎవరు పెట్టారో ఉండనీ ఏం కాదు అంటాడు రఘురాం. ఇంతలో అందరూ వచ్చి భరత్, రఘురాంకు అభినందనలు చెబుతుంటారు. దీంతో రఘురాంకు సంతోషం ఆగక.. ఈరోజు షాపునకు వద్దు కానీ ఇంటికి వెళ్దాం పదా అంటాడు.
ఇంటికి వెళ్లి మన ఊరంతా భరత్ బోర్డులు పెట్టారని చెబుతాడు రఘురాం. నాకైతే రెండు కళ్లు సరిపోలేదు.. అంటాడు. సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు పెడతారు కదా.. అలా మన భరత్ కోసం ఎక్కడ చూసినా బోర్డులే ఉన్నాయి అంటాడు. అసలు.. ఎవరు పెట్టి ఉంటారు.. అని ఆలోచిస్తుంటారు. కానీ.. ఆ బోర్డులు ఎవరు పెట్టి ఉంటారు.. అనేది ఎవ్వరికీ ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇంతలో లక్ష్మణ్ వస్తాడు. ఎవరు ఆ బోర్డులు పెట్టారో తెలియదు అంటాడు. కానీ.. ఆ బోర్డులను లక్ష్మణే పెట్టిస్తాడు. దీంతో అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు.
Vadinamma 20 Oct Today Episode : ఊళ్లో భరత్ ఫ్లెక్సీలు పెట్టించిన లక్ష్మణ్
నువ్వు నా కోసం ఎంతో త్యాగం చేశావు.. అయినా కూడా నేను సరిగ్గా చదవలేదు. కానీ నువ్వు రాత్రి పూట చదివి అందరూ తలెత్తుకునేలా చేశావు. నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెబుతాడు లక్ష్మణ్. అందుకే ఫ్లెక్సీలు పెట్టాను అంటాడు. ఆ ఫ్లెక్సీలను మాకు కూడా చూడాలని ఉంది అంటారు అందరూ. దీంతో అందరూ ఫ్లెక్సీల దగ్గరికి వచ్చి చూస్తారు. చాలా సంతోషిస్తారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా భరత్.. అంటుంది సీత. మీరు చెప్పిన మంచి మాటలు విని నన్ను నేను ఇలా మార్చుకున్నాను వదిన అంటాడు భరత్. ఇంతో ఊరి వాళ్లు అందరూ వచ్చి భరత్ తో సెల్ఫీలు దిగుతారు.

vadinamma 20 october 2021 full episode
ఇంతలో పార్వతి కూడా వస్తుంది ఇంటికి. చాలా సంతోషిస్తారు. సిరి, భరత్ ను మెచ్చుకుంటారు. పార్వతి… ఇక టీవీలో కనిపించలేదని చిన్నబుచ్చుకుంటుంది. ఎప్పుడూ అన్నావదినలేనా పక్కన అంటుంది. నీకన్నా మా సిరినే గొప్ప సీత అంటుంది. భరత్ ను బిడ్డ లెక్క పెంచావు కానీ.. బతుకుతెరువు కోసం చదివించలేకపోతివి అంటుంది. వయసులో చిన్నదైనా నా బిడ్డ సాధించింది. నువ్వు ఇన్నేళ్లు చేయలేని పని నా బిడ్డ చేసింది. ఈ ఆలోచన నీకెందుకు రాలేదు సీత. భరత్ చదువుకునుడు నీకు ఇష్టం లేదా.. అని అడుగుతుంది పార్వతి. దీంతో లేదు చదువుకోవడం నాకే ఇష్టం లేదు అంటాడు భరత్. అవన్నీ వదిలేయండి.. సంతోష సమయంలో ఇలాంటి మాటలు వద్దు అని చెప్పి ఇంట్లో అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.