Vadinamma 9 Nov Today Episode : మెట్ల మీది నుంచి కింద పడ్డ రిషి.. ఆసుపత్రిలో రక్తం కావాలంటే.. రిషికి రక్తం ఇచ్చిన రఘురామ్.. ఈ విషయం తెలిసి శైలూ షాక్
Vadinamma 9 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 695 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషిని శైలూ అస్సలు వదలదు. ఎప్పుడూ తన వెంటే ఉంచుకుంటుంది. రిషి ఏడ్చినా కూడా అస్సలు వినదు. రిషిని తీసుకొని పైకి వెళ్తుంది. ఎవ్వరినీ నీ దగ్గరికి రానివ్వను. ఒక బొమ్మ తెచ్చిస్తాను.. ఆడుకుంటే ఆడుకో లేకపోతే లేదు అంటూ అక్కడ పిల్లాడిని వదిలేసి వెళ్లిపోతుంది శైలూ. దీంతో మెట్ల మీది నుంచి రిషి కిందపడిపోతాడు. తలకు దెబ్బ తాకుతుంది. రక్తం బాగా కారుతుంది. వెంటనే రిషిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్ రిషిని చెక్ చేస్తాడు. ట్రీట్ మెంట్ చేస్తుంటాడు.

vadinamma 9 november 2021 full episode
ఇంతలో రఘురామ్.. ఈ ఆసుపత్రి కాకపోతే వేరే ఆసుపత్రికి తీసుకెళ్దాంరా అని లక్ష్మణ్ తో అంటాడు. ఇక చాలు అన్నయ్య చాలు. ఏదో ఒకటి కానీ.. వాడికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు చెబితే విన్నావా? ఇప్పుడు వాడికి జరిగినదానికి ఏం చేద్దాం అని అంటాడు లక్ష్మణ్. ఇంతలో డాక్టర్ వచ్చి రక్తం బాగా పోయింది. తల్లి రక్తం కానీ.. తండ్రి రక్తం కానీ కావాలి అంటాడు డాక్టర్. తల్లి ఎవరు అని అడుగుతాడు. దీంతో నేనే అని శైలూ అంటుంది. శైలూకు రక్త పరీక్షలు చేస్తారు.
ఇంతలో సీత.. డాక్టర్ దగ్గరికి వెళ్లి రిషి కన్నతల్లి.. శైలూ కాదని చెబుతుంది. దీంతో డాక్టర్ షాక్ అవుతాడు. మరి బాబుకు బ్లడ్ ఎలా అని అడుగుతాడు డాక్టర్. మా వారి బ్లడ్ గ్రూప్, బాబు బ్లడ్ గ్రూప్ ఒక్కటే. ఎవరికీ తెలియకుండా.. మా వారి బ్లడ్ ను రిషికి ఎక్కించండి.. అని వేడుకుంటుంది సీత. సరే అమ్మా.. మీ వారిని ల్యాబ్ దగ్గరికి రమ్మను.. మిగితా విషయాలు నేను చూసుకుంటాను అని చెబుతాడు డాక్టర్.
Vadinamma 9 Nov Today Episode : రిషికి బ్లడ్ ఇచ్చిన రఘురామ్
రఘురామ్ ను సీత పక్కకు పిలిచి.. బాబుకు బ్లడ్ ఇవ్వాలంటూ సీత కోరుతుంది. నీ బ్లడ్ తీసుకున్నట్టు శైలూకు తెలియకూడదు. జాగ్రత్తగా మేనేజ్ చేయ్ అని చెబుతుంది సీత. ఇంతలో లక్ష్మణ్ లేచి.. శైలూ బ్లడ్ ఇస్తుంది కదా.. ఏ రూమ్ అని అడుగుతాడు లక్ష్మణ్. దీంతో లాస్ట్ రూమ్ అని చెబుతుంది. ఇంతలో రూమ్ క్రాస్ చేసి వెళ్తుండగా.. రఘురామ్ బ్లడ్ ఇవ్వడం చూస్తాడు లక్ష్మణ్. ఇంతలో సీత వచ్చి.. రఘురామ్ వేరే బాబు కోసం బ్లడ్ ఇస్తున్నాడు అని సర్దిచెప్పుతుంది సీత.

vadinamma 9 november 2021 full episode
బాబుకు ఎలా ఉంది అని నర్సును అడుగుతాడు రఘురామ్. మీరు బ్లడ్ ఇచ్చారు కదా.. ఇప్పుడు అంతా నార్మల్ గా ఉంది అంటుంది నర్సు. ఈ విషయాన్ని శైలూ వింటుంది. బాబుకు మీరు బ్లడ్ ఇవ్వడం ఏంటి బావ గారు. ఇప్పుడే కదా నేను ఇచ్చి వస్తున్నాను చెప్పండి బావ గారు.. అంటుంది. ఇంతలో సీత విని.. మన బాబుకు కాదు.. వేరే బాబుకు ఇచ్చాడు అని చెబుతుంది సీత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.