Intinti Gruhalakshmi 9 Nov Today Episode : బెంగళూరులో హోటల్ లో ఒకే రూమ్ లో ఉన్న తులసి, నందు.. వాళ్లు ఏం చేస్తున్నారో అని టెన్షన్ పడ్డ లాస్య
Intinti Gruhalakshmi 9 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్, 2021 మంగళవారం ఎపిసోడ్ 472 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు, అయ్యగారు కలిసి బెంగళూరు వెళ్తున్నారంట కదా.. అని రాములమ్మ తులసితో అంటుంది. మీకు సంతోషంగా లేదా అమ్మా అంటుంది రాములమ్మ. నాది విడాకుల తర్వాత జీవితం. నాతో ఎన్ని బంధాలు ఉన్నా నేను ఒంటరిదాన్నే. నాకంటూ జీవితంలో ఎలాంటి సంతోషం, ఆశ లేదు. నన్ను చూసి నావాళ్లు ఆనందపడుతున్నారు అంతే. మరి.. అయ్యగారి కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు అంటుంది రాములమ్మ. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోతుంది తులసి. మీకు అయ్యగారు అంటే ఇప్పటికీ ఇష్టమే కదా అంటుంది రాములమ్మ.

intinti gruhalakshmi 9 november 2021 full episode
మరోవైపు తనకు బెంగళూరు వెళ్లేందుకు క్లయింట్ విమాన టికెట్టు పంపించలేదని లాస్య తెగ బాధపడుతుంది. ఇంతలో భాగ్య వచ్చి.. ఎంతైనా బావ గారు చాలా తెలివికలవారు అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది. నిన్ను ఇష్టపడి తులసికి విడాకులు ఇచ్చాడు. తులసి అంటే ఇష్టం ఉండి.. నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అంటూ చెబుతుంది భాగ్య. అయినా అన్నింటికీ నువ్వే కారణం.. అంటుంది. అసలు తులసే పెనాల్టీ కడుతుందంటూ నువ్వే కదా నొక్కి నొక్కి చెప్పింది అంటుంది బాగ్య. నువ్వే తులసికి ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇప్పుడు ఏం అనుకొని ఏం లాభం అంటుంది. బెంగళూరుకు ఇద్దరూ పక్కనే పక్కనే కూర్చొని వెళ్తారు. అక్కడ ఒకే రూమ్ కు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకో.. అని లాస్యకు లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది భాగ్య.
Intinti Gruhalakshmi 9 Nov Today Episode : బెంగళూరు వెళ్లిన తులసి, నందు
మరోవైపు తులసి ప్రయాణం కోసం చీరలన్నీ సర్దుతుంటారు అంకిత, శృతి, దివ్య. ఏం చేస్తున్నారు మీరు అనగానే.. చాలారోజుల తర్వాత మీరు ఊరికి వెళ్తున్నారు కదా.. అందుకే మేమే మీ బ్యాగు సర్దుతున్నాం అంటారు వాళ్లు. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. మీటింగ్ ఇంకో రెండు రోజులు ఎక్స్ టెండ్ అయ్యేలా ఉంది అందుకని.. బట్టలు ఎక్కువ సర్దుకొమ్మని చెప్పడానికి వచ్చాను అని అంటాడు నందు. దీంతో తులసికి ఏం చేయాలో పాలుపోదు. తులసి సిగ్గుపడుతుంది.

intinti gruhalakshmi 9 november 2021 full episode
ఉదయం అవుతుంది. బెంగళూరు వెళ్లడానికి తులసి, నందు ఇద్దరూ రెడీ అవుతారు. బయలుదేరుదామా తులసి అంటాడు నందు. ఓకే అంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి.. లాస్య దగ్గరికి వెళ్లి ఆఫీసుకు సంబంధించిన ఏవైనా డౌట్స్ వస్తే కాల్ చేయ్ అని చెబుతాడు నందు. ఏంటి బాగా హుషారుగా ఉన్నావు. విమానంలో పక్కపక్క సీట్లా అని అడుగుతుంది లాస్య. విమానం ఎక్కాక నిద్రపోకు. నీకు నిద్రలో పక్క వాళ్ల భుజాల మీద పడుకునే అలవాటు ఉంది.. అంటూ ఇలా అన్నీ చెబుతుంది.
మొత్తానికి నందు, తులసి.. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్తారు. మీటింగ్ రేపు ఉంది.. ఈరోజు రెస్ట్ తీసుకోండి అని నందు, తులసిని హోటల్ కు తీసుకెళ్తారు కంపెనీ సిబ్బంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.