Anchor Rashmi : రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు వైష్ణవ్.. అంత మాట అనేశాడేంటి?

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: September 7, 2022, 6:00 pm

Anchor Rashmi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా. ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీనే టాప్ లో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎంత మంది ఇండస్ట్రీలోకి వచ్చినా.. మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్ వేరు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక దారి చూపారు. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ..

అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవ్వగలిగారు. అందరూ సక్సెస్ కాలేకపోయారు. కట్ చేస్తే చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక్క సినిమాతోనే అతడికి సూపర్ డూపర్ క్రేజ్ వచ్చింది. ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు. కానీ… ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ప్లాఫ్ అయ్యాయి. ఇటీవల రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రష్మీపై కామెంట్స్ చేశాడు.

vaishnav tej comments on anchor rashmi in interview

vaishnav tej comments on anchor rashmi in interview

Anchor Rashmi : రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ కామెంట్స్

మీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలని అనుకుంటే.. ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారు.. అంటూ యాంకర్ వైష్ణవ్ ను అడిగారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా.. వైష్ణవ్ తేజ్ మాత్రం టక్కున యాంకర్ రష్మీ అని చెప్పేశాడు. రష్మీలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే తీరు అతడికి బాగా నచ్చుతాయట. అందుకే రష్మీ అయితే ఐటెమ్ సాంగ్ కు బాగుంటుందని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. అదేంటి.. వైష్ణవ్ అలా సమాధానం చెప్పాడు.. అంటూ ఆయన రష్మీ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. తన వచ్చే సినిమాలో అయినా రష్మీకి వైష్ణవ్ చాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp