Aadikeshava Movie Review : వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aadikeshava Movie Review : వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Aadikeshava Movie Review : Hero vaishnav Tej  ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ఉప్పెన సినిమా Uppena Movie అనగానే మనకు గుర్తొచ్చేవి రెండే రెండు క్యారెక్టర్లు ఒకటి బేబమ్మ అయితే మరోటి ఆసి క్యారెక్టర్. ఆ తర్వాత కొండపొలం అనే సినిమాలో నటించాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటించాడు. ఆ రెండు సినిమాలు వైష్ణవ్ తేజ్ Vaishnav Tej కు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి కానీ.. […]

 Authored By gatla | The Telugu News | Updated on :24 November 2023,3:00 am

ప్రధానాంశాలు:

  •  Aadikeshava Movie Review : వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

  •  Aadikeshava Movie ఆదికేశవ మూవీ రివ్యూ

Cast & Crew

  • Hero : పంజా వైష్ణవ్ తేజ్
  • Heroine : శ్రీలీల
  • Cast : జోజు జార్జ్, అపర్ణ దాస్, సుదర్శన్, రాధిక శరత్ కుమార్, తనికెళ్ల భరణి, సుమన్
  • Director : శ్రీకాంత్ ఎన్ రెడ్డి
  • Producer : నాగ వంశీ, సాయి సౌజన్య
  • Music : జీవీ ప్రకాష్ కుమార్
  • Cinematography : డుడ్లే

Aadikeshava Movie Review : Hero vaishnav Tej  ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ఉప్పెన సినిమా Uppena Movie అనగానే మనకు గుర్తొచ్చేవి రెండే రెండు క్యారెక్టర్లు ఒకటి బేబమ్మ అయితే మరోటి ఆసి క్యారెక్టర్. ఆ తర్వాత కొండపొలం అనే సినిమాలో నటించాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటించాడు. ఆ రెండు సినిమాలు వైష్ణవ్ తేజ్ Vaishnav Tej కు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి కానీ.. వైష్ణవ్ తేజ్ కు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును అయితే ఆ సినిమాలు తీసుకురాగలిగాయి. తాజాగా ఆదికేశవ అనే సినిమాలో హీరోగా నటించాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్. పంజా వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల Sreeleela హీరోయిన్ గా నటించింది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాను విడుదల చేశారు. సినిమా నిడివి 129 నిమిషాలు ఉంటుంది.

Aadikeshava Movie Review : కథ ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

హైదరాబాద్ లో ఉండే ఓ కుర్రాడు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాల గురించి తెలుసుకుంటాడు. దీంతో హైదరాబాద్ వదిలి బ్రహ్మసముద్రం గ్రామానికి వెళ్లి అక్కడ జరిగే అరాచకాలు, దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేదే ఆదికేశవ సినిమా. వైష్ణవ్ తేజ్(బాలకోటయ్య) హైదరాబాద్ లో జాబ్ ట్రయల్స్ లో ఉంటాడు. అదే సమయంలో బాలకోటయ్యకు శ్రీలీల(చిత్రావతి) పరిచయం అవుతుంది. ఆమె కాస్మెటిక్ కంపెనీకి సీఈవో. ఆ కంపెనీలో ఎలాగోలా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత బాలకోటయ్య.. చిత్రావతిని ప్రేమిస్తాడు. తన ప్రేమ విషయం చిత్రావతికి చెప్పాలని అనుకున్న సమయంలోనే వేరే కంపెనీ సీఈవోతో చిత్రావతి పెళ్లిని తన తండ్రి ఫిక్స్ చేస్తాడు. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్రావతి తండ్రితో గొడవ పడతాడు బాలకోటయ్య. అప్పుడే తన నాన్న చనిపోతాడు. ఆ విషయాన్ని బాలకోటయ్యకు తనికెళ్ల భరణి చెబుతాడు. దీంతో బ్రహ్మసముద్రంలో జరిగే దారుణాల గురించి బాలకోటయ్యకు తెలుస్తుంది. దీంతో అక్కడికి వెళ్లి ఆ దారుణాలను ఎలా అడ్డుకున్నాడు.. తన తండ్రి ఎలా చనిపోయాడు. చివరకు చిత్రావతిని బాలకోటయ్య పెళ్లి చేసుకుంటాడా అనేదే ఈ సినిమా మిగితా కథ.

Aadikeshava Movie Review : విశ్లేషణ ఆదికేశవ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ సినిమాకు చివరి 45 నిమిషాలు హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అంతా రొటీన్ అనే చెప్పుకోవాలి. అంటే.. కొంచెం కామెడీ, కొంచెం లవ్.. అలా గడిచిపోతుంది. కానీ.. అసలు సినిమా సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బాలకోటయ్య.. అసలు ఆదికేశవగా ఎలా మారాడు.. అనేదే అసలు ట్విస్ట్. క్లైమాక్స్ ఫైట్ అదుర్స్ అని చెప్పుకోవాలి. బాలకోటయ్య, ఆదికేశవ.. ఈ రెండు పాత్రల్లో నటించిన వైష్ణవ్ తేజ్ అదరగొట్టేశాడు అనే చెప్పుకోవాలి. ఇక.. ముఖ్య పాత్రల్లో నటించిన సుమన్, రాధిక, తనికెళ్ల భరణి లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు అదరగొట్టేశారు. శ్రీలీల కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది.

అయితే.. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిన కథలా అనిపిస్తుంది. ఇందులో కొత్తదనమేమీ ఉండదు. ఆడియెన్స్ కూడా సినిమా చూస్తూ తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలుగుతారు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. కాకపోతే కథ చెప్పే విధానం, సినిమా టేకింగ్ బాగుంటుంది. ఇక.. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ పార్ట్ ను కూడా డైరెక్టర్ టచ్ చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం హాల్ లో నవ్వులు పూయిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షనే ఇక. ఫస్ట్ హాఫ్ హైదరాబాద్.. సెకండ్ హాఫ్ రాయలసీమ.. నరుకుడే నరుకుడు.. ఇలా రొటీన్ గా ఉంటుంది కథ. దీంతో కొన్ని చోట్లు ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. నటన పరంగా వైష్ణవ్ తేజ్ చాలా పరిణితి చెందాడు. ఈ సినిమాతో మరోసారి మాస్ హీరో అనిపించుకున్నాడు.. ఇక.. హీరోయిన్ గా నటించిన శ్రీలీల కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉంది. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. గ్లామర్ మాత్రం బాగానే ఒలకబోసింది శ్రీలీల. వాళ్లిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ బాగుంది.

ఇక.. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే అచ్చం బోయపాటి సినిమాను గుర్తు చేస్తాయి. మాస్ హీరోయిజం ఎలివేషన్ కూడా ఉంటుంది. నిజానికి ఇది ఒక మాస్ అండ్ కమర్షియల్ మూవీ అనుకుంటారు కానీ.. ఇది కామెడీ అండ్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. కథ చెప్పే విధానంలో డైరెక్టర్ ఎంతో కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. కాకపోతే.. హీరోయిజంను అతిగా ఎలివేట్ చేసినట్టుగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

కామెడీ

శ్రీలీల డ్యాన్స్

వైష్ణవ్ తేజ్ యాక్టింగ్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

కెమెరా వర్క్

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

హీరోయిజం

ఆర్టిఫిషియల్ సీన్స్

యాక్షన్ ఎపిసోడ్స్

రొటీన్ కథ

మితిమీరిన హింస

రొటీన్ లవ్ స్టోరీ

Rating :

2.5/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది