Vakeel saab : వకీల్ సాబ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడుతున్నాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vakeel saab : వకీల్ సాబ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడుతున్నాడు..!

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా సృష్ఠిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ రీ ఎంట్రీ దెబ్బకి కరోనా సెకండ్ వేవ్ కూడా లెక్క చేయకుండా అభిమానుల సందడి తారా స్థాయిలో ఉంది. జస్ట్ థియేట్రికల్ ట్రైలర్ కే థియేటర్స్ బద్దలు కొట్టారంటే ఇక సినిమా రిలీజ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అదుపు చేసే వారు ఎవరన్నా ఉండగలరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడేళ్ళ తర్వాత పవర్ […]

 Authored By govind | The Telugu News | Updated on :8 April 2021,1:25 pm

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా సృష్ఠిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ రీ ఎంట్రీ దెబ్బకి కరోనా సెకండ్ వేవ్ కూడా లెక్క చేయకుండా అభిమానుల సందడి తారా స్థాయిలో ఉంది. జస్ట్ థియేట్రికల్ ట్రైలర్ కే థియేటర్స్ బద్దలు కొట్టారంటే ఇక సినిమా రిలీజ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అదుపు చేసే వారు ఎవరన్నా ఉండగలరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ అన్నీ నిండిపోతాయన్న సంగతి తెలిసిందే. అడ్వాస్ బుకింగ్స్ తో వకీల్ సాబ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

vakeel saab is breaking all time records

vakeel-saab-is breaking all time records

విదేశాలలో మొదలైన సునామీ ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది. విదేశాలలో వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్ పదిరోజుల ముందే మొదలై అన్నీ షోస్ హౌజ్ ఫుల్ అయిపోయాయి. దాదాపు 700 స్క్రీన్స్ లో వకీల్ సాబ్ దిగుతున్నాడు. ఇక ఇండియాలో కూడా అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోస్ కొన్ని చోట్ల ప్లాన్ చేశారు. మరి ఎన్ని చోట్ల అనుమతులు లభిస్తాయో తెలీదు గానీ ఉదయం 7 గంటల నుంచి మాత్రం అన్నీ ప్రాంతాలలో అన్నీ థియేటర్స్ లో వకీల్ సాబ్ దిగడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ వారం రోజుల వరకు హౌజ్ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది.

Vakeel saab : ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ .. వకీల్ సాబ్ మాట తప్ప మరో మాట వినిపించడం లేదు.

హైదరాబాద్ లో మొదటి రోజు మొత్తం 580 షోలు పడబోతుండగా దాదాపు 95 శాతం బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. వైజాగ్ లో 121 షోస్ కాగా నెల్లూరులో 60 షోలు పడనున్నాయి. అయితే నెల్లూరులో 97 శాతం, వైజాగ్ లో 82 శాతం బుకింగ్స్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ మ్యానియా తో నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఊహించని రేంజ్ లో లాభాలు రావడం పక్కా అంటున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ .. వకీల్ సాబ్ మాట తప్ప మరో మాట వినిపించడం లేదు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది