vakeel saab Trailer : వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్..ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్న పవర్ స్టార్..!

vakeel saab Trailer : వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న థియోట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు. గత ఏడాది మే 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా క్రైసిస్ కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. అయితే పవర్ స్టార్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్ కావడంతో మెగా అభిమానుల్లో.. యావత్ తెలుగు సినీ ప్రేమికుల్లో ఆకాశాన్ని అంటేలా అంచనాలు పెరిగాయి.

గత ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన ‘మగువా మగువా’ సాంగ్ ప్రతీ ఒక్కరి మనసుల్లోకి దూసుకుపోయింది. ఇక ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా మళ్ళీ ఈ సినిమా నుంచి ‘సత్యమేవ జయతే’ సాంగ్ రిలీజై అందరినీ ఆకట్టుకోవడమే కాదు సినిమా ఏ నేపథ్యంలో సాగుతుందో ఒక క్లారిటీ వచ్చేలా చేసింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్‌ల మీద తెరకెక్కించిన ‘కంటి పాప’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి యూత్ ఆడియన్స్‌కి కావాల్సిన రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. థమన్ ఈ మూడు సాంగ్స్‌ని ఎంతో స్పెషల్‌గా ట్యూన్ చేశాడని విన్న ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు.

vakeel saab Trailer : పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలన్న దిల్ రాజు కల నెరవేరిన సినిమా..!

కాగా వకీల్ సాబ్ సినిమా భారీ స్థాయిలో ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న సినిమా.. పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలన్న దిల్ రాజు కల నెరవేరిన సినిమా.. ఏ దర్శకుడైనా..ఇతర నటీ నటులు.. టెక్నీషియన్స్ ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయాలనుకునే సినిమా..మొత్తంగా వకీల్ సాబ్ రూపంలో రాబోతోంది. అందుకే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం బ్లైండ్‌గా ఖర్చు చేశాడు.

ప్రమోషన్స్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్టుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం మ్యూజిక్ ఫెస్ట్ అలాగే పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా రేంజ్‌ని ఆకాశమే హద్దుగా పెంచే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు. పలు చోట్ల గాలిలో వకీల్ సాబ్ బెలూన్స్ కూడా ఎగురుతున్నాయి. ఒక్కో బెలూన్ ఖర్చు అక్షరాలా రూ.30 వేయిలంటే దిల్ రాజు ఎంతగా ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నాడో తెలుస్తోంది. ఈ క్రమంలో వకీల్ సాబ్ థియోట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు థియోట్రికల్ ట్రైలర్ కోసం థియోట్ర్స్ ని ఎంపిక చేసుకున్నది లేదు.

vakeel saab Trailer : అన్నీ కమర్షియం అంశాలని దర్శకుడు వేణు శ్రీరాం పుష్కలంగా పొందు పరిచాడు.

అలాంటిది మొట్ట మొదటిసారి ఆంధ్రా, తెలంగాణలలో ఉన్న పలు థియోటర్స్‌ని రెండ్రోజుల క్రితమే వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు లిస్ట్ వేసి రెడీ చేశారు. ఆ థియోటర్స్‌ లో తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇంతక ముందు టీజర్‌లో కోర్టులో వాదించడమూ తెలుసు ..కోటు తీసి కొట్టడము తెలుసు అన్న పవర్ స్టార్ అంతకు మించి ట్రైలర్‌లో తన ఎమోషన్స్‌ని.. లాయర్‌గా ముగ్గురు ఆడపిల్లలని కాపాడేందుకు చేసిన ప్రయత్నం, పోరాటం అంద్భుతంగా చూపించారు. బాలీవుడ్ పింక్ సినిమా కథని పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు ..అభిమానులకి, ప్రేక్షకులని కావాల్సిన అన్నీ కమర్షియల్ అంశాలని దర్శకుడు వేణు శ్రీరాం పుష్కలంగా పొందు పరిచాడు.

ఇక తాజా ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు మూడేళ్ళ తర్వాత వస్తున్న పవర్ స్టార్ గ్యారెంటీగా వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ట్రైలర్ రిలీజైన కొన్ని నిముషాలలోనే మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియోట్ చేసింది. కాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో శృతి హాసన్..కీలక పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పిస్తున్నాడు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago