Varalakshmi Sarathkumar : నా పెళ్లి విషయంలో నాకే క్లారిటీ లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 3 May 2024, 8:00 am
  •  Varalakshmi Sarathkumar : నా పెళ్లి విషయంలో నాకే క్లారిటీ లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్..

Varalakshmi Sarathkumar : తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. మరి ముఖ్యంగా ఈమె మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక అప్పటినుండిి ఈ అమ్మడు వరుసగా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా ఈమె నటిస్తూ వస్తుంది. అయితే ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ “శబరి” అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మూవీ టీమ్..

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకున్నారు. మరి ముఖ్యంగా ఆమె పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం పై క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవానికి గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న వరలక్ష్మి తనకు పెళ్లిపై క్లారిటీీ లేదని , పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పలు సందర్భాలలో చెబుతూ వచ్చారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇటీవల ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకొని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక ఇదే విషయంపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ గతంలో మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. కాని ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మీ మ్యారేజ్ డిసిషన్ ఎలా తీసుకున్నానో మీకే తెలియదని తెలియజేశారు.

Varalakshmi Sarathkumar : నా పెళ్లి విషయంలో నాకే క్లారిటీ లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్..!

Varalakshmi Sarathkumar : నా పెళ్లి విషయంలో నాకే క్లారిటీ లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్..!

Varalakshmi Sarathkumar : నా పెళ్లి పై నాకే క్లారిటీ లేదు…

నా మ్యారేజ్ నాకే సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పారు. అయితే అసలు మ్యారేజ్ చేసుకోను అనే ఆలోచన నుంచి మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచన లోకి ఎలా వచ్చారు అని యాంకర్ వరలక్ష్మి అడగగా…దానికి ఆమె సమాధానం ఇస్తూ పెళ్లి అనేది ఇద్దరు మనసులతో కూడుకున్నది. ఎప్పుడైతే ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడతారో అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అంతేకానీ మా తాత చచ్చిపోతున్నాడు , వయసు అయిపోతుంది అంటూ పెళ్లి చేసుకోవడం నిజమైన పెళ్లి కాదు అనేది నా అభిప్రాయం అంటూ వరలక్ష్మి తెలిపారు. ఇక నా పెళ్లి విషయంలో నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్సు చేయలేదని , నాకు నచ్చి నేను ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లికి ఓకే చెప్పినట్లుగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. ఈ రోజుల్లో ఇదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నచ్చకుండా పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడటం నరకం తో కూడుకున్న పని అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి