Varalakshmi : శబరి ట్రైలర్ రిలీజ్…..రిపోర్టర్స్ ప్రశ్నలపై వరలక్ష్మి సీరియస్ కామెంట్స్…

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,9:00 pm

Varalakshmi  : వరలక్ష్మి శరత్ కుమార్… ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. విలక్షణ పాత్రలలో కనిపిస్తూ ,పాత్రకు తగ్గట్టుగా తన స్టైల్ యాక్టింగ్ ని మారుస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ఈమె పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డిలో ప్రధాన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించి ఆకట్టుకున్నారు . ఆ విధంగా లేడీ విలన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో శబరి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇక ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను తెలుగు , తమిళ్, మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

అయితే ఇప్పటికే శబరి సినిమా పై పలు రకాల అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మూవీ టీమ్ తాజాగాశబరి సినిమా ట్రైలర్ విడుదల చేసారు. దీనిలో భాగంగానే మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ ల వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు వరలక్ష్మి శరత్ కుమార్ ను పలు రకాల ప్రశ్నలు అడగ్గా ఆమె అన్నింటికీ నవ్వుతూ సమాధానం చెప్పింది.

Varalakshmi : శబరి ట్రైలర్ రిలీజ్.....రిపోర్టర్స్ ప్రశ్నలపై వరలక్ష్మి సీరియస్ కామెంట్స్...

Varalakshmi : శబరి ట్రైలర్ రిలీజ్…..రిపోర్టర్స్ ప్రశ్నలపై వరలక్ష్మి సీరియస్ కామెంట్స్…

Varalakshmi  వైలెంట్ క్యారెక్టర్ కాదు…

ఇక ఈ సినిమా లో ఇంతకుముందు నన్ను చూడని పాత్రలో కచ్చితంగా చూస్తారని శరత్ కుమార్ తెలియజేశారు. అంతేకాక నా ప్రేక్షకులను నేను కచ్చితంగా అలరించే ప్రయత్నం చేస్తాను తప్ప వారిని డిస్సపాయింట్ చేయనని కావున ఈ సినిమా కచ్చితంగా అభిమానులు చూసి ఎంజాయ్ చేస్తారంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈ సినిమాలో తనది వైలెంట్ క్యారెక్టర్ కాదని తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చేసే ప్రయత్నాలు అంటూ, సినిమాలో కూడా మీరు అదే చూస్తారు అంటూ ఆమె తెలిపారు. ఇది ఇలా ఉండగ కొన్ని రోజుల క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ జరిగింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొనున్నట్లు ఆమె తెలిపారు.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి