Veera Simha Reddy : వీరసింహా రెడ్డి సినిమా విషయం లో కనీ వినీ ఎరుగని ట్విస్ట్ – ఒక్కొక్కడికీ చావు దెబ్బ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 January 2023,7:40 pm

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాలతో విడుదలైంది. ఇక ఆ రేంజ్ లోనే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. సెకండ్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ హనీ రోజ్ నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటినుంచి జనాలు ఊహించిన విధంగానే బాలయ్యను సరికొత్త మాస్ యాంగిల్ లో గోపీచంద్ మలినేని చూపించారు. ఈ సినిమా మొత్తాన్ని బాలయ్య తన భుజాలపై మోసాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి వీరసింహారెడ్డి పాత్ర ఎంత హైలెట్ అయిందో వరలక్ష్మి శరత్ కుమార్ భాను పాత్ర కూడా అంతే హైలెట్గా నిలిచింది. అన్నను చంపిన చెల్లిగా తన పగలు తీర్చుకున్నాను అన్న పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే మొదట ఈ సినిమా కథను రాసుకున్నప్పుడు గోపీచంద్ ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కీర్తి సురేష్ ని అడిగారట. అప్పటికే బోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర చేస్తున్న కీర్తి సురేష్ కు వీరసింహారెడ్డి సినిమాలో చేస్తే మరింత క్రేజ్ వస్తుందని ఆమెను అడిగారు.

varalakshmi sarathkumar highlight role in veera simha reddy

varalakshmi sarathkumar highlight role in veera simha reddy

అంతేకాదు సినిమా కథను కూడా కీర్తి సురేష్ కు వినిపించారట. అయితే ఆమెకు కథ నచ్చిన సైలెంట్ క్యారెక్టర్ లో చెల్లి పాత్రకు నేను సెట్ అవ్వగలను కానీ వైల్డ్ గా ఉన్న చెల్లి పాత్రలో నేను సెట్ అవ్వను అని ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఈ క్రమంలోనే ఆ పాత్రకి వరలక్ష్మి శరత్ కుమార్ సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్యకు పోటాపోటీగా నటించింది. ఈ సినిమాకి ఆమె ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా త్వరలోనే ఆ అంచనాలను దాటేయనుంది. బాలయ్య కెరీర్ లోనే ఇది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి