Varalaxmi Sharat Kumar : ఆ పనులు చేయలేకనే విలన్ గా మారా.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 10, 2023, 5:40 pm

Varalaxmi Sharat Kumar : సినిమా ఇండస్ట్రీ అంటేనే అదో మాయాలోకం. అక్కడ నెగ్గుకు రావాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలి. లేదంటే కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం ఉండాలి. కమిట్ మెంట్స్ ఇవ్వగలగాలి. హీరోయిన్ గా రాణించడం అనేది మామూలు విషయం కాదు. ఎంత అందం, టాలెంట్ ఉన్నా హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. చాలామంది ఎన్నో కలలు కని.. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ.. దానికి తగ్గట్టుగా కష్టపడరు. ఫిజిక్ ను మెయిన్ టెన్ చేయరు. కమిట్ మెంట్స్ ఇవ్వరు. దీంతో వాళ్లు హీరోయిన్ అవ్వాల్సిన వాళ్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. చివరకు వాళ్లు స్టార్ కూతుళ్లు అయినా..

ఇంకెవరైనా అందం, అభినయం ఉంటే చాలదు.. అన్నింటికీ తట్టుకోగలగాలి. అలా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చింది స్టార్ డాటర్ వరలక్ష్మీ శరత్ కుమార్. నిజానికి తను శరత్ కుమార్ కూతురుగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా తను చేసిన సినిమాలు తక్కువే. అందులో సూపర్ హిట్ అయినవి కూడా చాలా తక్కువ. అందుకే వరలక్ష్మి హీరోయిన్ రోల్స్ కాకుండా.. విలన్ పాత్రల వైపే ఎక్కువ మొగ్గు చూపింది. అందుకే తనకు విలన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. దీంతో పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ గా నటించింది. తాజాగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా విలన్ పాత్రనే పోషించింది వరలక్ష్మి. మీరు హీరోయిన్ మెటీరియల్ కదా.. మరీ ఇప్పుడు విలన్ గా ఎందుకు చేస్తున్నారు

varalaxmi sharath kumar comments about her heroine role

varalaxmi sharath kumar comments about her heroine role

Varalaxmi Sharat Kumar : సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి

అంటూ ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు యాంకర్ ప్రశ్నించగా.. పలు సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మి. హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించాలంటే.. గ్లామర్ గా ఉండాలి. గ్లామర్ గా లేకపోతే హీరోయిన్ గా అవకాశాలు రావడం చాలా కష్టం. ఆ తలనొప్పులు నేను భరించలేను. అందుకే విలన్ రోల్స్ చేసుకుంటున్నా.. అంటూ వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో వరలక్ష్మికి పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ అవకాశాలు వస్తుండటంతో వాటిని చేసుకుంటూ విలన్ గా తన సత్తా చాటుతోంది వరలక్ష్మి.

Breaking News 2

No bio available for this author.

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp