Varsha And Emmanuel : రోడ్డు మీద పడి అడుక్కుతింటున్నారు.. వర్ష, ఇమాన్యుయేల్‌కు పట్టిన గతి ఇదే.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 29, 2021, 6:38 pm

Varsha And Emmanuel : జబర్దస్త్ షోలో ఆ మధ్య వర్ష ఓసారి అడుక్కుతినే క్యారెక్టర్ వేసింది. ఆ స్కిట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో వర్ష పిచ్చిదానిలా కరెక్ట్‌గా సరిపోయింది.. అడుక్కునేదానిలా ఉందని కూడా రోజా కౌంటర్ వేసింది. అలా ఆమెను అందరూ దారుణంగా ట్రోల్ చేసేశారు. కానీ ఆ గెటప్పులో మాత్రం వర్ష నిజంగానే కరెక్ట్‌గా సరిపోయింది.

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

అందుకేనేమో ఈ సారి నిజంగా బిచ్చగత్తెలా మారిపోయింది. రోడ్డు మీదకు వచ్చింది. అందరినీ అడుక్కుంటూ రోడ్డు మీద ప్రాధేయపడుతోంది.వర్ష, ఇమాన్యుయేల్ రోడ్డు మీదకు అడుక్కునేవారిలా వచ్చారు. కానీ ఇదంతా కూడా ఈవెంట్‌లో భాగమే. వినాయక చవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్ రాబోతోన్న సంగతి తెలిసిందే.

 

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

రోడ్డు మీద పడి అడుక్కుతింటున్నారు.. వర్ష, ఇమాన్యుయేల్‌కు పట్టిన గతి ఇదే! Varsha And Emmanuel

ఇందులో వర్ష, ఇమాన్యుయేల్ స్పెషల్ స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. దీని కోసం నిజంగానే అడుక్కునే వారిలా మారిపోయారు. బిచ్చగాళ్ల గెటప్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చారు. ఆ గెటప్పులో ఒక్కడికైనా ప్రపోజ్ చేసి ఒప్పించాలని కండీషన్ పెట్టారు. దీంతో వర్ష రోడ్డు మీదకు బిచ్చగత్తెలా వచ్చింది. అందరూ ఆమెను తోసేసి అవతలకు పోయారు.

 

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

Varsha And Emmanuel Begging On Roads In Oorilo Vinayakudu

జనాలు బిచ్చగత్తె రూపంలో ఉన్న వర్షను ఎవ్వరూ గుర్తు పట్టలేకపోయారు. ఇక వర్షకు తోడుగా ఇమాన్యుయేల్ కూడా బిచ్చగాడిలా వెంటే తిరుగుతూ వచ్చాడు. మొత్తానికి ఈ జోడి పరిస్థితి మాత్రం ఇలా తయారైంది. ఈవెంట్ కోసం ఇలా చేయడం సాహసమే అయినా కూడా అందరూ తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈవెంట్ మాత్రం హైలెట్ అయ్యేలానే ఉంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp