Varsha : ఇమాన్యుయేల్‌ను లాగి పెట్టిన కొట్టిన వర్ష.. దెబ్బకు అంతా షాక్!!

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 13, 2021, 7:20 pm

Varsha : జబర్దస్త్ తెరపై ఎన్నో జోడీలను స్పెషల్ ఐడెంటిటీ ఉంది. అందులో సుడిగాలి సుధీర్- రష్మీ జోడీ ఫుల్ పాపులర్ కాగా అదే రేంజ్‌లో ఇమ్మాన్యుయేల్- వర్ష జోడీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబోగా తమదైన పంచ్ డైలాగ్స్, రొమాంటిక్ మూమెంట్స్‌తో ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు బలంగా మారారు. దీంతో అటు వర్ష, ఇటు ఇమ్మాన్యుయేల్ మంచి ఫేమ్ కొట్టేశారు.

Varsha Slaps Emmanuel infront of all others

Varsha Slaps Emmanuel infront of all others

ఇంతలోనే ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని, సీక్రెట్‌గా వీళ్ళిద్దరూ రిలేషన్ నడుపుతున్నారని టాక్ బయటకు వచ్చేసింది. దానికి తోడు ఈవెంట్ మేనేజర్స్ వీళ్లపై వేస్తున్న రొమాంటిక్ స్కిట్స్ వర్ష- ఇమ్మాన్యుయేల్ సీక్రెట్ రిలేషన్‌కి బలం చేకూర్చాయి. అంతటితో ఆగక ఎన్నో స్పెషల్ షోస్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ పెళ్లి కూడా చేసేశారు. దీంతో వీళ్ళ ఎఫైర్ బాగా ముదిరిందని అంతా ఫిక్సయ్యారు.

Varsha  ఇమ్మాన్యుయేల్ చెంప పగలగొట్టిన వర్ష

Varsha Slaps Emmanuel infront of all others

Varsha Slaps Emmanuel infront of all others

ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ వీడియోలో వర్ష వచ్చి ఇమ్మాన్యుయేల్ చెంప పగలగొట్టడం హైలైట్ అయింది. ‘దసరా బుల్లోళ్ళు’ అంటూ ఈ పండుగకు ఓ స్పెషల్ షో ప్లాన్ చేసి ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో వర్ష- ఇమ్మాన్యుయేల్ సీన్ చూసి అంతా షాకయ్యారు. ఓ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇమ్మాన్యుయేల్ దగ్గరికి పోయి ‘ఏంటి ఆ అమ్మాయి నీ షర్ట్ పట్టుకుంటుంది’ అంటూ అందరూ చూస్తుండగానే చెంపపై గట్టిగా ఒక్కట్టించింది వర్ష. ఇంకేముంది ఈ సీన్‌తో ఈ వీడియో వైరల్ అయింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp