Varshini Sounderajan : లంగావోణిలోనూ అందాల ఆరబోత.. తగ్గేదేలే అంటున్న వర్షిణి..!
Varshini Sounderajan : బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్.. బుల్లితెరపైన సక్సెస్ ఫుల్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఇకపోతే ఈ భామ స్పెషల్ ఈవెంట్స్‌లోనూ అప్పుడప్పుడు మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తను డ్యాన్స్ చేసే వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరలయ్యాయి కూడా. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ బాగా వైరలవుతున్నాయి.
సంప్రదాయానికి ప్రతీక అయిన లంగావోణిలో వర్షిణి చాలా అందంగా కనబడుతోంది. ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో వర్షిణి చాలా చక్కగా కనబడుతోంది. పెసరు రంగు జాకెట్, లంగా, ఎరుపు రంగు వోణిలో తగు ఆభరణాలు ధరించి వర్షిణి చాలా చక్కగా ఉంది. అలా లంగావోణిలో వర్షిణి రకరకాల స్టిల్స్ ఇచ్చిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, నెట్టింట అవి బాగా వైరలవుతున్నాయి.

varshini sounderajan shared her latest photos in twitter
Varshini Sounderajan : వెల్లివిరిసిన సంప్రదాయ సౌరభం..
ఇక ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, లవ్ యూ బేబీ, సూపర్బ్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫొటోల్లో వర్షిణి అలా నడుముపై చేయి వేసుకుని, కొంటెగా చూస్తూ, నవ్వుతూ.. బ్యాక్ సైడ్ స్టిల్స్ ఇచ్చింది. చూపులతోనే మత్తెక్కిస్తోంది వర్షిణి. వర్షిణి పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో కీ రోల్ ప్లే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.