varun sandesh : ఆ టైంలో నా భార్య నరకం చూసింది.. నటుడు వరుణ్ సందేశ్ సంచలన కామెంట్స్!

 Authored By mallesh | The Telugu News | Updated on :29 December 2021,8:15 am

varun sandesh : తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. చేసిన తొలిచిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని తనకంటూ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఓ నటితో ప్రేమ వ్యవహారం నడిపించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వరుణ్ సందేశ్ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఆ మధ్యలో బిగ్‌బాస్ సీజన్‌లో కనిపించి అభిమానులను మెప్పించాడు. తాజాగా వరుణ్ తన భార్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

varun sandesh : బిగ్‌బాస్ హౌస్‌‌కు బయట చాలా వ్యత్యాసం..

వరుణ్ సందేశ్ ‘హ్యాపీడేస్’ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో పాటు ‘కొత్త బంగారు లోకం’ మూవీతో మరో హిట్ అందుకున్నాడు వరుణ్.. ఆ తర్వాత ‘ఏమైంది ఈవేళ’, ‘మరోచరిత్ర’, ‘కుర్రాడు’, ‘చమ్మక్ చల్లో’, ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘నువ్వలా నేనిలా’ ఇంకా చాలా సినిమాలు చేసినా అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అయితే, పడ్డానండి ప్రేమలో మరి సినిమా షూటింగ్ టైంలో కో స్టార్ ‘వితిక’ను ప్రేమించి పెళ్లాడాడు వరుణ్.. తన తండ్రి వితికను కూతురిలా చూసుకుంటాడని వెల్లడించాడు.

varun sandesh About on his -wife

varun sandesh About on his -wife

అయితే, తామిద్దరం బిగ్ బాస్ షో నుంచి బయటకు కొందరు దారుణంగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. అందులో ఒకడు చేసిన కామెంట్స్ వలన తన భార్య నరకం చూసిందని కామెంట్స్ చేశాడు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేదానిపై వరుణ్ రివీల్ చేయలేదు. ఒక వ్యక్తితో కలిసి కూర్చుని, మాట్లాడితే అలా ఎలా దారుణంగా మాట్లాడుతారని ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌‌కు బయట చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై ఎం. శ్రీనివాసరాజు డైరెక్షన్‌లో ‘ఇందువదన’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఫర్నాజ్ శెట్టి వరుణ్ సందేశ్‌కు జోడిగా కనిపించనుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి