Varun Sandesh : వయనాడ్ బాధుతుల కోసం 5 కోట్లు.. ఆ యువ హీరో గురించి సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజం ఏంటి.?
కేరళలో వయనాడ్ కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి ఎంతో ప్రాణ ధన నష్టం జరిగిన విషయం తెలిసిందే. ప్రకృతి విలయ తాండానికి కేరళలోని వయనాడ్ ప్రాంతం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అక్కడి ప్రజలు బ్రతుకు జీవిడా అంటూ పొట్ట చేతపట్టుకుని ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలకు కేరళ ప్రభుత్వం వేరే ప్రాంతాలకు తరలించగా ఇండియన్ ఆర్మీ 100 కలిసి 31 గంటల్లో వయనాడ్ వరదలను అడ్డుకునేందుకు ఒక వంతెనను నిర్మించారు. ఐతే కేరళ […]
ప్రధానాంశాలు:
Varun Sandesh : వయనాడ్ బాధుతుల కోసం 5 కోట్లు.. ఆ యువ హీరోని చూసి సిగ్గుపడాలంటూ ప్రేక్షకుల స్పందన..!
కేరళలో వయనాడ్ కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి ఎంతో ప్రాణ ధన నష్టం జరిగిన విషయం తెలిసిందే. ప్రకృతి విలయ తాండానికి కేరళలోని వయనాడ్ ప్రాంతం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అక్కడి ప్రజలు బ్రతుకు జీవిడా అంటూ పొట్ట చేతపట్టుకుని ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలకు కేరళ ప్రభుత్వం వేరే ప్రాంతాలకు తరలించగా ఇండియన్ ఆర్మీ 100 కలిసి 31 గంటల్లో వయనాడ్ వరదలను అడ్డుకునేందుకు ఒక వంతెనను నిర్మించారు. ఐతే కేరళ వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీస్ అంతా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, చరణ్ కలిసి 1 కోటి విరాళం ఇవ్వగా ప్రభాస్ 2 కోట్లు విరాళం అందించాడు. కమల్ హాసన్, మమ్ముట్టి, రష్మిక, అల్లు అర్జున్ ఇలా అందరు స్టార్స్ వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం అందించారు. ఐతే స్టార్స్ సైతం అవాక్కయ్యేలా యువ హీరో వరుణ్ సందేష్ వయనాడ్ ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడని వార్తలు వస్తున్నాయి…
Varun Sandesh అసలేమాత్రం ఫాం లో లేని హీరో..
వరుణ్ సందేష్ అంటే హ్యాపీడేస్ సినిమా గుర్తుకొస్తుంది. దాదాపు 12, 13 ఏళ్లు కావొస్తున్నా సరే ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఐతే ఆ టైం లో వరుణ్ సందేష్ మంచి ఫాం కొనసాగించగా తర్వాత ఎందుకో సరైన సినిమాలు పడక వెనకపడ్డాడు. ఈమధ్య వరుస సినిమాలతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
వరుణ్ సందేష్ వయనాడ్ బాధుతుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 కోట్ల రూపాయల దాకా సహాయం చేశాడని. ఫాం లో ఉన్న సూపర్ స్టార్స్ సైతం 1, 2 కోట్లు విరాళంగా ఇస్తుంటే అసలేమాత్రం ఫాం లో లేని వరుణ్ సందేష్ ఏకంగా 5 కోట్లు డొనేట్ చేస్తూ తన గొప్ప మనసు చాటుకున్నాడని సోషల్ మీడియాలో ఒకటే హంగామా జరుగుతుంది.వరుణ్ సందేష్ లాంటి చిన్న హీరో ప్రకటించిన ఈ డొనేషన్ విషయంలో అసలు వాస్తవం ఏంటి. నిజంగానే అతను 5 కోట్లు ఇచ్చాడా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.