Varun Sandesh : త‌న భార్య నిద్ర మాత్ర‌లు మింగిన‌ట్టు చెప్పిన వ‌రుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Varun Sandesh : త‌న భార్య నిద్ర మాత్ర‌లు మింగిన‌ట్టు చెప్పిన వ‌రుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?

Varun Sandesh  : టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి చిత్రాల‌తో పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ హిట్టు అందుకొని చాలా కాల‌మైంది. ఓ మంచి సినిమాతో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొన్నాళ్లుగా త‌న‌కు అచ్చొచ్చిన ల‌వ్‌స్టోరీస్ కాకుండా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తోన్నాడు వ‌రుణ్ సందేశ్‌.వ‌రుణ్ సందేశ్ చేసిన తాజా మూవీ నింద‌. […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Varun Sandesh : త‌న భార్య నిద్ర మాత్ర‌లు మింగిన‌ట్టు చెప్పిన వ‌రుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?

Varun Sandesh  : టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి చిత్రాల‌తో పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ హిట్టు అందుకొని చాలా కాల‌మైంది. ఓ మంచి సినిమాతో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొన్నాళ్లుగా త‌న‌కు అచ్చొచ్చిన ల‌వ్‌స్టోరీస్ కాకుండా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తోన్నాడు వ‌రుణ్ సందేశ్‌.వ‌రుణ్ సందేశ్ చేసిన తాజా మూవీ నింద‌. క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి రాజేష్ జగన్నాధం వ‌హించాడు. జూన్ 21న థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యథార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీ రూపొందుతోంది.

Varun Sandesh  అసలు విష‌యం ఇదే..

వ‌రుణ్ సందేశ్ గ‌తంలో విల‌న్‌గా కూడా ప‌ని చేశారు. అయితే ఆయ‌న విల‌న్‌గా చేసిన పెద్ద‌గా పేరు తెచ్చుకోలేక‌పోయారు. అయితే ప్ర‌స్తుతం నింద చిత్రం చేస్తున్న వ‌రుణ్ సందేశ్ తాజా ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌నల్ లైఫ్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. వ‌రుణ్ సందేశ్ హీరోయిన్ వితికా షేర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇప్పటివరకు పిల్లలే కాలేదు. నిత్యం ఈ విషయం పైన ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. అయినప్పటికి ఈ విషయం పైన అదిరిపోయే కౌంటర్లను సైతం ఇస్తూ ఉంటారు ఈ జంట. వరుణ్ తో పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటికి ఈ వార్తలు వైరల్ గా కావడంతో తాజాగా వరుణ్ సందేశ్ ఈ విషయం పైన అసలు విషయాన్ని తెలియజేశారు.

Varun Sandesh త‌న భార్య నిద్ర మాత్ర‌లు మింగిన‌ట్టు చెప్పిన వ‌రుణ్ సందేశ్ ఎందుకలా చేసింది

Varun Sandesh : త‌న భార్య నిద్ర మాత్ర‌లు మింగిన‌ట్టు చెప్పిన వ‌రుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?

ముఖ్యంగా తన భార్య వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని దీంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అప్పుడు తనకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు ఇలాంటి మందులు ఇచ్చారని వాటితో పాటు వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిపారు. అయితే వితికా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము. కానీ అందులో నిజం లేదని తెలిపింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని వరుణ్ సందేశ్ తెలిపారు. అయితే వెంటనే ఈ విషయం తెలియగానే బయలుదేరి వచ్చేసానని తెలిపారు. తాను వెబ్ సిరీస్ చేస్తుంద‌ని, ఎప్పటికీ త‌న‌కి అండ‌గా ఉంటాన‌ని వ‌రుణ్ చెప్పుకొచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది